నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు అసెంబ్లీ లో ఉల్లిఘాటు బాగానే తగిలింది. అసెంబ్లీ సమావేశాలు మొదలు కాకముందే టీడీపీ నేతలు అసెంబ్లీ ముందు ఉల్లిపాయలు మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. భారీగా పెరిగిన ఉల్లి ధరలపై టిడిపి అధినేత చంద్రబాబు కూడా నిరసన తెలిపారు. సభలో ఉల్లిపాయల ధరలు పై టిడిపి జగన్ సర్కారును  ప్రశ్నించగా... చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్ లోనే రెండు వందల రూపాయలకు కిలో ఉల్లిపాయలు అమ్ముతున్నారు అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. 

 


 కాగా  ఈరోజు కూడా అసెంబ్లీలో ఉల్లిఘాటు బాగానే ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష అధికార పార్టీ మధ్య ఉల్లిధరల పై జరిగిన చర్చ వేడిని పుట్టించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో కిలో ఉల్లిపాయలు రెండు వందలకు అమ్ముతున్నారు అంటూ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉల్లి ధరలు భారీగా పెరిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉల్లిని  ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో సబ్సిడీ పై తక్కువ ధరకే  అందజేస్తుందని అందుకే ప్రజలందరూ రైతుబజార్లకు క్యూ  కడుతూన్నారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు  శవ రాజకీయాలు కొత్తేమీ కాదని విమర్శించారు. 

 


 అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా భారీ స్థాయిలో స్పందించారు. హెరిటేజ్ ఫ్రెష్ తమది కాదని పలు మార్లు చెప్పినప్పటికీ కూడా జగన్ అవే  మాటలు మాట్లాడడం సరికాదంటూ చంద్రబాబు అన్నారు. దీని గురించి నిన్ననే సభలో తాను పూర్తి క్లారిటీ  ఇచ్చానని...  అయినప్పటికీ సభ్యత్వం లేకుండా మళ్లీ అదే మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ తమదే అంటున్న జగన్ కు సవాల్ విసురుతున్నానని...  ఒకవేళ హెరిటేజ్ సంస్థ తమదే అని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని... ఒకవేళ నిరూపించకపోతే ముఖ్యమంత్రి పదవికి జగన్  రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. భారతి సిమెంట్స్ సోలార్ విండ్ పవర్ పెట్టుకుని  మీలాగా మేము మోసాలు చేయలేదని చంద్రబాబు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: