మొదట్లో మెజీషియన్ గా అలరించిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత బుల్లి తెర హాస్య నటుడిగా, యాంకర్ గా, ఇప్పుడు హీరో గా తెలుగు ప్రేక్షక అభిమానులను అలరిస్తున్నాడు. సాఫ్ట్ వేర్ సుధీర్ తో పాటు త్రీ మంకీస్ అనే సినిమాలో కూడా హీరో గా నటించాడు శృంగార వీరుడు సుధీర్. ఇటీవల 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చిన సుధీర్ తన వ్యక్తిగత విషయాలను వెల్లడించాడు.

అయితే.. తన సొంతూరు విజయవాడ అని, తనని నటుడుగా చూడాలనే కోరిక అతని అమ్మకు బలంగా ఉండేదని చెప్పుకొచ్చాడు సుధీర్. అందుకే చదువు మానేసిన వాళ్ళ అమ్మ, నాన్న సపోర్ట్ చేసారని వివరించాడు. జాబ్ ఏం చేయలేదా అని ఆలీ ప్రశ్నించినప్పుడు, హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో కాల్ సెంటర్ లో వర్క్ చేద్దామని ఇంటర్వ్యూకు వెళ్లానని.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అమ్మాయి కావడంతో వెంటనే సెలెక్ట్ అయ్యానని నవ్వుతూ చెప్పాడు సుధీర్. ఆ తర్వాత కాల్ సెంటర్ జాబ్ కు సెలెక్ట్ అయ్యినప్పటికీ అతని రూమ్ ఆఫీస్ కు దూరంగా ఉండటంతో జాయిన్ అవ్వలేదని చెప్పాడు.


సుధీర్, తన మొదటి సంపాదన రూ.93 అని, అవి కూడా ఒక పాఠశాలలో మ్యాజిక్ చేస్తే ఇచ్చారని చెప్పాడు. రిక్షా ఎక్కితే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయోనని నడుచుకుంటూ ఇంటికి వెళ్లానని, మొత్తం డబ్బులు తన నాన్నకి ఇవ్వగానే అతడు బాగా సంతోషించాడని ఎమోషనల్ అయ్యాడు సుధీర్.

5వ తరగతిలో ఒక అమ్మాయికి లైన్ వేస్తే 9వ తరగతిలో ఆ అమ్మాయి ఒప్పుకుందని, కాకపోతే వీరి ప్రేమ విషయం అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసి గొడవలయ్యాయని చెప్పాడు. దాంతో, అమ్మాయిలను, అబ్బాయిలను వేరు వేరు క్లాస్ రూమ్స్ లో కుర్చోపెట్టారని తెలిపాడు. అయితే సుధీర్ 10వ తరగతి పాస్ అయ్యి స్కూల్ వదిలి వెళ్లిన తర్వాత, అమ్మాయిలను అబ్బాయిలను కలిపే కూర్చోపెట్టారని చెప్పాడు.

ఆలీ తో సరదాగా షో మొత్తం కార్యక్రమంలో రష్మి పేరు మారుమ్రోగింది. ఆలీ... 'రష్మి-సుధీర్' కలిసి ఉన్న ఫోటో స్క్రీన్ పై డిస్ప్లే చేసి నవ్వులు పూవ్వులు పండించాడు. ఆ తర్వాత రష్మీ పైన నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించినప్పుడు.. 'తను చాలా ఇబ్బందులు ఎదుర్కొని పైకి వచ్చింది. ఆమె జీవితంలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాత తనపై ఇష్టం కన్నా గౌరవం మరింత పెరిగింది.' అని చెప్పాడు. రష్మి గురించి ఒక్కమాటలో చెప్పమంటే, ఏం చెప్తావని ప్రశ్నించినప్పుడు... 'నా లైఫ్‌. ఎందుకంటే సుధీర్‌ అనగానే మొదట వచ్చే చర్చ రష్మి. జనాలు ఇవాళ నా గురించి మాట్లాడుకుంటున్నారంటే తన వల్లే.' అని వివరించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: