ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఈ చలి కాలంలో పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మాటలతో అసెంబ్లీ వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. ఇక సమావేశాల్లో రెండవ రోజైన ఈరోజు కూడా టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. 

 

రాష్ట్రంలో ఉల్లి కొరత బాగా ఉందని, ఉల్లి కొనడానికి వెళ్లి ఒక వ్యక్తి చనిపోయాడు అని టీడీపీ చేసిన విమర్శలకు మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఉల్లి కొనడానికి ఒక వ్యక్తి నిన్న మార్కెట్ కి వెళ్లి అక్కడ జనాల మధ్య చనిపోయారు అని టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. "చంద్రబాబుకు శవాల మీద రాజకీయం చేయడం బాగా అలవాటైంది" అంటూ బాబుపై విరుచుకుపడ్డారు కొడాలి నాని. 

 

"సాంబిరెడ్డి అనే వ్యక్తి ఒక రిటైర్డ్ ఆర్టీసి డ్రైవర్, తన ఇద్దరు కొడుకులు సాఫ్టువేర్ ఇంజినీర్లు, ఆర్ధికంగా బాగా స్థిరపడిన కుటుంబం వాళ్ళది. ఇక సాంబిరెడ్డి కుటుంబం వేరే దగ్గర ఉంటున్నా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సాంబిరెడ్డి మాత్రం ఇక్కడే ఉంటున్నారు. తనకు గతంలో ఒకసారి గుండె పోటు వచ్చింది అదే కాకుండా పక్షవాతం కూడా ఉంది అలాంటి ఒక వ్యక్తిని ఉల్లి కొనమని ఎవరైనా పంపిస్తారా?, అసలు అలాంటి ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తి లైన్లో నిలబడగలడా?" అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. 

 

రోజూ మార్కెటుకు వెళ్లే అలవాటు ఉన్న ఆ పెద్దాయన, మార్గం మధ్యలో గుండె పోటుతో మరణిస్తే టీడీపీ శవ రాజకీయం చేస్తోందని కొడాలి నాని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ హాల్లో చనిపోయిన వ్యక్తి కొడుకు మీడియాతో మాట్లాడిన దృశ్యాలు నాని ప్లే చేసి అందరికి చూపించారు. "మా నాన్న ఉల్లి కొనడానికి వెళ్లి చనిపోయారు అని ప్రచారం జరుగుతోంది అది అవాస్తవం, మా నాన్న గారికి గుండెపోటు వచ్చి మరణించారు" అని మరణించిన వ్యక్తి కొడుకు స్పష్టం చేశారు.

 

రాష్ట్రం అంతా చంద్రబాబు తన జాగీరు అనుకుంటున్నారని, ఇది గుడివాడ ఇక్కడ కొడాలి నాని వున్నాడని గుర్తు పెట్టుకోవాలని నాని డైలాగులు పేల్చారు. ఈ వీడియో చూసిన టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: