దేశంలో  అత్యుత్తమ  ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ టాప్ 5 లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే.  జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను టాప్ లిస్టులో నిలబెట్టింది.  జగన్ ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నారు.  అనేక పధకాలు ప్రవేశపెట్టారు.  ఈ పధకాలు ఒక్కొక్కటి వరసగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆరు నెలల్లోగా అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకున్నారు.  


ఇంత తక్కువ సమయంలో సమర్ధవంతంగా ప్లాన్  సమర్ధవంతంగా పధకాలు అమలు చేస్తూ.. పరిపాలన చేస్తున్న సీఎంగా జగన్ పేరు తెచ్చుకున్నారు.  గతంలో కెసిఆర్ ముందు ఉండేవారు.  కానీ, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్ ను వెనక్కి నెట్టారు. ప్రతి విషయంలో అందరి కంటే జగన్ ముందు ఉంటున్నాడు.  దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ఉల్లి ధరలు కొండెక్కడంతో.. ప్రజల కష్టాలను గమనించిన జగన్, తక్కువ ధరకు ఉల్లిని ప్రజలకు అందించాలని అనుకున్నాడు.  


ఇందులో భాగంగానే రైతు బజార్లలో కేవలం రూ. 25 కే ఉల్లిని అందిస్తున్నారు.  ప్రతి ఒక్కరికి కేజీ ఉల్లి చొప్పున ప్రజలకు అందజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రైతు బజార్లలో ఈ ధరకు ఉల్లి అందిస్తుండటం విశేషం.  అయితే, తెలంగాణలో మాత్రం అలాంటిది ఏమి ఉన్నట్టుగా కనిపించడం లేదు.  కేజీ ఉల్లి హైదరాబాద్ లో రూ. 150కి పైగా పలుకుతుంది.  ఇక ఇదిలా ఉంటె, మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రమైన బెంగాల్ లోని ప్రభుత్వ దుకాణాల్లో ఉల్లి కేజీ రూ. 69 కి  అమ్ముతున్నారు.  


దీన్ని బట్టి చూస్తే మమత కంటే జగన్ వందరెట్లు బెటర్ అని చెప్పొచ్చు.  ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు జగన్ కేజీ ఉల్లిని రూ. 25 కి అందిస్తుంటే.. మమత మాత్రం రూ.69 కి అందిస్తున్నది. గతంలో మమత పాలన బాగుందని చాలా మంది అంటుండేవారు.  మమత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలన సూపర్ గా ఉందని, బెంగాల్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని అంటున్నారు.  కానీ, మమత వచ్చిన తరువాతే బెంగాల్ రాష్ట్రంలోకి వలస పెరిగింది.  ఇది వాస్తవం.  

మరింత సమాచారం తెలుసుకోండి: