ఏపీ అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ వాడివేడిగా జరుగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య చిన్న మాటల యుద్ధం జరిగింది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలనుకున్నారు. అందరూ కలిసి ఆయన చెవిలో పూలు పెడతారు. రైతుల రుణాన్ని మాఫీ చేస్తామని చంద్రబాబు దగా చేసారని బుగ్గన అన్నారు.

 

 

ఎన్నికల హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు 88వేల కోట్ల రుణాలను 24వేల కోట్లకు కుదించారు. లేనిది ఉన్నట్టు సృష్టించి చంద్రబాబు చెపుతున్నారు. ఆయన పాలనలో రైతులకు బ్యాంక్ లు లోన్లు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు. రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేసారని బుగ్గన అన్నారు. ఆరోజు చంద్రబాబు.. ప్రతి రైతుకు ఉన్న అపౌ మొత్తం తీరుస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులమయం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా డిస్కమ్ నిధులు వాడారు. నీరు-చెట్టు పేరుతో విచ్చలవిడిగా దోచుకున్నారు. రైతులకు బ్యాంకు లోన్లు ఇవ్వని పరిస్థితి తీసుకువచ్చారు.

 

 

మా దగ్గర అన్ని లెక్కలూ ఉన్నాయి. 40 ఏళ్ల అనుభవంతో బాబు ఏం సాధించారో ఆయనకే తెలియాలి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రైతులకు సున్నా వడ్డీ పథకం అని రద్దు చేశారు. పీఎం కిసాన్ ఆధారంగా అన్నదాత సుఖీభవ అనే పథకం తెచ్చి భారం అంతా సివిల్ సప్లైస్, డిస్కంల మీద పెట్టి ఆ వ్యవస్థలని కుప్పకూల్చారు. ఆ మొత్తాన్ని పసుపు కుంకుమగా తీసుకొచ్చారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కీంకు వారి ప్రభుత్వంలోనే నిధులు కేటాయించలేదని బుగ్గన ఆరోపించారు.

 

 

చంద్రన్న కానుక, చంద్రన్న భీమా, ఎన్టీఆర్ భరోసా.. అని ఏ పథకానికి నిధులు సమకూర్చుకోలేకపోయారు. నీరు చెట్టు అనే కార్యక్రమం మాత్రం నరేగా నిధులు దోచుకోవడానికి చేశారని ఆరోపించారు. చంద్రబాబు మామీద ఆరోపణలు మాని రైతులకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలని అన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు పూర్తి న్యాయం జరుగుతోందని ఆర్ధికమంత్రి బుగ్గన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: