ఈ రోజు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో చంద్రబాబు నాయుడు బాగా ఫైర్ అయ్యాడు. నిజానికి సాక్షి వార్తాపత్రిక 'ఇక సన్న బియ్యం సరఫరా' అంటూ ఒక సమీక్షను ప్రచురించింది. దీంతో జగన్ దాని గురించి మాట్లాడుతూ... 'సాక్షి పేపర్ లో 'సన్నబియ్యం సరఫరా' అని తప్పు రాసారు అధ్యక్షా.. అదే రోజు వేరే పేపర్ లలో వచ్చినటువంటివి కూడా ఒకసారి టిడిపి నేతలు చదివి తెలుసుకుంటే సంతోషపడతాను. టిడిపి నేతల మాదిరే నాణ్యమైన బియ్యానికి, సన్న బియ్యానికి తేడా తెలియక కొంచెం పొరపాటుపడి సన్న బియ్యం అని రాసారు.' అని ఒక సమర్థతని ఇచ్చాడు.

దీన్నే ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, ' సాక్షి పేపర్ ను ఎవరు నమ్మరు కాబట్టి... ఈ సభలో స్వయంగా జగనే చెప్పాడు అధ్యక్షా... సాక్షి పేపర్ ని నమ్మడానికి వీల్లేదు.. కాబట్టి ఈనాడు పేపర్, ఆంధ్ర జ్యోతి పేపర్ కు రైతుల కోసం అడ్వేర్టీసెమెంట్ ఇస్తానని చెప్పాడు అధ్యక్షా.' అని అన్నాడు. ఆ తర్వాత కొడాలి నాని మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడికి 70ఏళ్ల వయసు వచ్చి.. తప్పులు మాట్లాడుతున్నాడని, ఆయనకు సమకాలీకుడైన కొడుకు.. జగన్ ముఖ్యమంత్రి అయితే.. సలహాలు ఇవ్వాల్సింది పోయి సాక్షి పేపర్ అవినీతి పేపర్ అంటున్నాడని అన్నారు. రైతులకు ఏదైనా సమస్యలు వస్తే ఈనాడు పేపర్ లో యాడ్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ అందించి.. రైతులు ఫోన్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తానని జగన్ అన్నారని... ఆ విషయం గాలికి వదిలేసి సాక్షి పేపర్ ని అవినీతి పేపర్ అంటాడేంటి ఈ దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కౌంటర్ ఇచ్చాడు, కొడాలి నాని.

దీంతో చంద్రబాబు లేచి.. 'నేను ఒక్కడిని మాట్లాడితే 15 మంది సమాధానాలు ఇస్తున్నారు అధ్యక్షా. మీరు నన్ను ఏం చేయలేరు.. మీరు 151 మంది అయినా.. నేను సమాధానం చెప్పగలను. నా వయసు గురించి మాట్లాడుతున్నారు?!. నా వయసు ఎంత ఉన్నా.. 25 ఏళ్ల కుర్రాడు ఎలా ఆలోచిస్తాడో.. అలానే నా ఆలోచనలు ఉంటాయి. ఏం బాధ లేదు! మీకు సవాల్ విసురుతున్నా. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టేంత వరకు నేను నిద్ర పోకుండా కృషి చేసి.. నా నిజాయితీ నిరుపించుకుంటాను తప్ప... మీకు మాదిరే వెనక్కి పోయే సమస్యే లేదు. మీరు ఈ హౌస్లో 50 మంది మూకుమ్మడిగా దాడి చేస్తే... మేమేదో భయపపడతామని అనుకుంటే..(అది మీ అమాయకత్వమే) 50 కాదు 151 మంది మూకుమ్మడిగా దాడి చేసినా... నిలబడుకునే శక్తి తెలుగు దేశం పార్టీకి ఉంది, అధ్యక్షా' అంటూ మగధీర సినిమాలో రాంచరణ్ లాగా ఆవేశంతో డైలాగ్ కొట్టాడు.

దాంతో జగన్ తో సహా వైసీపీ నేతలు పకపక నవ్వారు.

'హా హా హా అని నవ్వడం కాదు.. మీ 151 మందిని ఒక్కేసారి ఎదుర్కుంటా... ఇలాంటివి నేను ఎన్నో చూసా' అని చంద్రబాబు అన్నాడు. ఆ తర్వాత మీ వైసీపీ నేతల మైండ్ గేములు తన దగ్గర చెల్లవని, జగన్ మైండ్ గేమ్స్ ఆడటంలో ఒక ఎక్సపర్ట్ అని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: