పార్లమెంట్లో.పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ అని రకాల పర్యటనం చేసింది. నిన్న అర్ధరాత్రి బిల్లు పాస్ అయింది. నిన్న పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసి తన కొత్త మిత్రపక్షమైన కాంగ్రెస్, ఎన్సీపీలకు షాక్ ఇచ్చింది శివ సేన. తాజాగా తన పంధాని మార్చుతూ తెర మీదకు కొత్త షరతులు తెచ్చి బీజేపీకి ఝులక్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

 

పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై విమర్శలు చేస్తూనే, లోక్ సభలో అది  ఓటింగ్ జరిగే సమయానికి మాత్రం ఊహించని రీతిలో అందరికి షాక్ ఇస్తూ శివసేన బీజేపీకి అనుకూలంగా ఓటేయటం తెలిసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం శివసేన తీరును తప్పు పట్టేలా ట్వీట్ చేశారు. ఇటువంటి సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు.

 

 లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లు రాజ్యసభలోనూ పాస్ కావాల్సి ఉంది. అయితే రాజ్యసభలో బీజేపీ బలం చాల తక్కువగా ఉండటం. ఒకరి సాయం లేకుండా గెలవలేని స్థితి. తాజాగా శివసేన తీసుకొచ్చిన కొత్త షరతులు విపక్షాలు సైతం అంగీకరించేలా ఉన్నాయి.


 
అసలు శివసేన తాజా డిమాండ్ ఏంటి అంటే పౌరసత్వం పొందిన వారికి పాతికేళ్ల వరకూ ఓటు హక్కు ఇవ్వకూడదన్న రూల్ తీసుకోని రావాలని కొత్త మెలికను పెట్టారు. తమ పెట్టిన షరతు మీద స్పష్టత వచ్చే వరకూ అలాగే తమకున్న అనుమానాల్ని అన్ని తీర్చే వరకూ రాజ్యసభలో ఈ బిల్లుకు తమ తరుపున మద్దతు ఉండదు అని చెప్పారు. మొత్తానికి శివసేన టైం చూసి బీజేపీని భారీ దెబ్బ కొట్టారు . బీజేపీ ఆలోచనలకి దగ్గరగా ఉండే శివసేన.. మొత్తానికి పౌరసత్వ సవరణ బిల్లుకు ఓకే చెబుతూనే మరో వైపు తన మిత్రపక్షమైన కాంగ్రెస్ కు వచ్చిన  కోపాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ షరతును తెచ్చారన్న మాట వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: