పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు....10 ఏళ్ల ప్రతిపక్షలో ఉండి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... అధికారంలో శాశ్వతంగా ఉండిపోదామని కలలుగన్నారు. కానీ ఆయన పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు అయిదేళ్లలోనే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చిపెట్టుకున్నారు. దీంతో చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు దగ్గరైన జగన్ సీఎం అయిపోయారు. అయితే ఘోరంగా ఓడిపోవడమో లేక జూనియర్ గా ఉన్న జగన్ సీఎం అయిపోయారనే బాధేమో తెలియదు గానీ చంద్రబాబుకు అసహనం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతుంది.

 

ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ కనిపిస్తోంది. ఒకప్పుడు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న నిర్మాణాత్మకమైన విమర్శలు చేసిన  చంద్రబాబు ఇప్పుడు మాత్రం అర్ధపర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి అదే పనిగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రజలు కూడా చంద్రబాబు ఏ విషయం చెప్పిన అది వేస్ట్ అని ఆలోచనకు వచ్చేస్తున్నారు. కనీసం అర్ధం ఉండే విమర్శలు చేస్తే ప్రజలు ఏదైనా పట్టించుకుంటారు. కానీ బాబు మాత్రం అలా చేయడం లేదు.

 

ఇక బాబు అసహనం తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మరింత ఎక్కువైపోయింది. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 ఏళ్ళు సీఎం, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేసిన అనుభవం ఉన్న... ఓర్పు ఏ మాత్రం ఉండటం లేదు. ఈయన మాత్రం వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారు కానీ... వైసీపీ ఎలాంటి విమర్శలు చేసిన తట్టుకోలేకపోతున్నారు. తాజాగా కూడా వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని చెబుతున్న తరుణంలో బాబు...ఆయన మీదకు దూసుకెళ్లెంత పని చేశారు.

 

అలాగే టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడుతుంటే..ఆయనని తన ఎమ్మెల్యేల చేత అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు అది కుదరకపోయే సరికి వాకౌట్ చేశారు. ఇలా చిన్న చిన్న విషయాలకే బాబు బరస్ట్ అయిపోతున్నారు. ఏదేమైనా బాబు మీద వయసు ప్రభావం పడిందో, ఓటమి ప్రభావం పడిందో తెలియదుగానీ..ఆయనలో అసహనం పీక్స్ కు వెళ్లిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: