అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా చంద్రబాబునాయుడుకు ఎన్నో రోజులుండదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తోంది. తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీని స్పీకర్ తమ్మినేని సీతారాం స్వతంత్ర ఎంఎల్ఏగా గుర్తించారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వంశీ చెప్పారు.

 

నియోజకవర్గ ప్రయోజనాలకోసమని తనను ఇండిపెండెంట్ ఎంఎల్ఏగా గుర్తించాలని వంశీ చేసిన విజ్ఞప్తిని స్పీకర్ గుర్తించారు. ప్రత్యేకంగా సీటు కూడా కేటాయించారు. అంటే వంశీ వైసిపి పార్టీలో చేరకుండానే, ఎంఎల్ఏ పదవికి ఎటువంటి ఢోకా లేకుండానే సభలో కంటిన్యు అవుతారన్నమాట.  ఇదే విషయం అసెంబ్లీలో  చాలా కీలకంగా మారింది.

 

టిడిపిలో కంటిన్యు అవటం చాలామంది ఎంఎల్ఏలకు ఇష్టంలేదు. అయితే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారితే అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఇంకా చాలామంది టిడిపిలో కంటిన్యు అవుతున్నారు. వీలైనంతలో టిడిపి నుండి బయటపడాలని అనుకున్న వాళ్ళకు తాజాగా వంశీ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది.

 

టిడిపికి రాజీనామా చేయాలని అనుకుంటున్న గణబాబు, గొట్టిపాటి రవి, సాంబశివరావు, కరణం బలరామ్, గంటా కూడా వంశీ లాగే తమను కూడా ఇండిపెండెంట్ ఎంఎల్ఏలుగా గుర్తించమని స్పీకర్ ను అడిగే అవకాశాలున్నాయి. ఎలాగూ వంశీ విషయంలో మొదలైన సంప్రదాయాలనే స్పీకర్ మిగిలిన ఎంఎల్ఏల విషయంలో కూడా పాటించే అవకాశాలున్నాయి. 22 మంది ఎంఎల్ఏల్లో  7 మంది గనుక టిడిపికి రాజీనామా చేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవటం ఖాయం.

 

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోతే చంద్రబాబుకు క్యాబినెట్ ర్యాంకు పడిపోతుంది. అప్పుడు మాజీ సిఎం కూడా మిగిలిన వాళ్ళలాగే సాధారణ ఎంఎల్ఏ అయిపోతారు. 13 మంది ఎంఎల్ఏలు టిడిపికి తొందరలో రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. నిజంగానే అంతమంది ఎంఎల్ఏలు టిడిపి నుండి బయటకు వచ్చేస్తే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎన్ని రోజులుంటుందో ఏమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: