దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే దిశ హత్య కేసులో నలుగురు నిందితుల మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని గాంధీ దవాఖానకు తరలించారు. మహబూబ్‌నగర్ దవాఖాన నుంచి సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏసీ అంబులెన్స్‌లో పటష్ట భద్రత నడుమ తరలించారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌చేసిన పోలీసులపై సిట్ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్లను బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేప‌థ్యంలో సైబారాబాద్ సీపీ సజ్జనార్ హ‌ఠాత్తుగా ఢిల్లీకి వెళుతున్నారు.

 

మ‌ళ్లీ బాబును బుక్ చేసిన లోకేష్...జ‌గ‌న్‌కు ఎంత మంచి చాన్స్ ఇచ్చేశాడు క‌దా?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట  న్యాయవాదులు జీఎస్ మణి, ఎంఎల్ శర్మ దిశ కేసుల‌ను ప్ర‌స్తావించారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై సిట్ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. వీటిని బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టులో ఎన్‌కౌంట‌ర్ విచారణకు రానున్న నేప‌థ్యంలో కేసు విచారణకు సీపీ సజ్జనార్ స్వయంగా హాజరు కానున్నారు. బుధ‌వారం ఉద‌యం సీపీ స‌జ్జ‌నార్ ఢిల్లీకి వెళుతున్నారు. ఇదే స‌మ‌యంలో నాలుగు రోజుల పాటు సేకరించిన సమాచారాన్ని రేపు సుప్రీం కోర్టుకు నేష‌న‌ల్ హ్యూమ‌న్ రైట్స్ క‌మిష‌న్ స‌మ‌ర్పించనుంది. 

ద‌టీజ్ జ‌గ‌న్‌... అమిత్‌షా అవాక్కు...బీజేపీకి ఒక్క‌రోజే డబుల్ షాక్‌...

మ‌రోవైపు, దిశ ఘటనలో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నిందితులు ఈ నెల 6న చటాన్‌పల్లి వద్ద పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ సభ్యులతో సీపీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్విర్తించాలన్నదానిపై రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ స్పష్టతనిచ్చినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: