ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రసవత్తమైన చెణుకులు పేలుతున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఇవి ఆసక్తికరమైన కామెంట్లకు దారి తీస్తున్నాయి. అలాంటిదే ఇది కూడా. చంద్రబాబుకు 70 ఏళ్ల వయస్సు. ఆయన కుమారుడికి దాదాపు 35 ఏళ్లు వయస్సు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యిందట.

 

ఈ విషయం చెబుతున్నారు వైసీపీ నాయకులు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఏదో తేడా కనిపిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సభలో చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు.

 

టీడీపీ సభ్యులకు సభా సంప్రాదాయాలు తెలియడం లేదని అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన ఫొటోలను ఆయన సభలో చూపించారు. అసత్యాలను సునాయాసంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. అయితే దీనికి టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో సమాధానం వినిపించింది.

 

ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. తన వయస్సు 70 ఏళ్లు అయినా తాను ఇంకా యువకుడిగానే ఆలోచిస్తానని అన్నారు. యువకుడి తరహాలోనే జోరుగా ఉంటానని చెప్పకనే చెప్పారు. అంతే కాదు.. తాను ఒక్కడికి.. 151 ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పే సత్తా ఉందని చెప్పుకొచ్చారు. అయితే దీన్ని అంబటి రాంబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.

 

మాట్లాడేందుకు మైక్ ఇస్తే తాను.. 150 మందికి కాదు.. వెయ్యిమందికైనా సమాధాం చెప్పే సత్తా ఉందని.. అది పెద్ద విషయం కానే కాదని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అదో పెద్ద సత్తా మాదిరిగా మాట్లాడటం ఏంటని నిలదీశారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో వయస్సులపై ఇలా జరిగిన సంభాషణ ఆసక్తిరంగా మారింది. కాస్త వినోదం పంచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: