సాక్షి మీడియా ఏపీ సీఎం జగన్ సొంత మీడియా అన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన అపురూప కానుక సాక్షి పత్రిక, సాక్షి ఛానల్.. ఈ విషయాన్ని ఏపీ రాజకీయాలను నిశితంగా గమనించే వారు తప్పకుండా ఒప్పుకుంటారు. సాక్షి మీడియా అంటూ ఒకటి లేకపోతే.. జగన్ కూడా ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకులా ఉండిపోయేవారు

 

మహా అయితే ఓ ఎంపీనో, మంత్రో అయ్యి ఉండే వారు. అంతే తప్పు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి ఉండేవారు కాదు. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే జగన్ కు ఇంతగా సాయపడుతున్న సాక్షి మీడియా.. ఒక్కోసారి ఆయనకు తలనొప్పిగానూ మారుతుంది. ఆది ఆయన సొంత ఛానెల్ కావడంతో ప్రత్యర్థుల కళ్లు దానిపై ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా ఓ విషయంలో ఇదే జరిగింది.

 

జగన్ ప్రజలకు రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తానన్నారంటూ సాక్షి మీడియాలో వార్త వచ్చింది. అదే సమయంలో మిగిలిన మీడియాలో నాణ్యమైన బియ్యం అని వచ్చింది. ఇప్పుడు ఇదే విషయాన్ని పట్టుకుని విపక్షం రచ్చచేస్తోంది. ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు.. కావాలంటే సాక్షి పత్రిక క్లిప్పింగులు చూడండి అంటూ విమర్శిస్తున్నారు.

 

దీనిపై అసెంబ్లీలో ఏకంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సాక్షి పత్రికలో అలా పొరపాటున అలా వచ్చిన మాట వాస్తవమేనని.. అక్కడ కూడా మనుషులే పని చేస్తారు.. తప్ప.. యంత్రాలు కావని కామెంట్ చేశారు. అదే సమయంలో ఇతర మీడియాలో వచ్చిన వార్తలను ఆయన చదివి వినిపించారు. తమ మేనిఫెస్టోను కూడా ఆయన ప్రదర్శించారు. మొత్తానికి సాక్షి మీడియా జగన్ సొంత మీడియా కావడంతో ఇంత ఇష్యూకు కారణమైంది. ఈ విషయంపై జగన్ క్లారిటీ ఇచ్చాక విషయం సద్దుమణిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: