తూర్పు చెక్ నగరమైన ఓస్ట్రావాలోని ఒక ఆసుపత్రి వెయిటింగ్ రూమ్‌లో 42 ఏళ్ల హంతకుడు   మంగళవారం ఆరుగురిని హతమార్చాడు. ఓస్ట్రావాలోని యూనివర్శిటీ హాస్పిటల్ యొక్క అవుట్  పేషెంట్ విభాగంలో  తెల్లవారుజామున జరిగిన  కాల్పులకు  ప్రేరేపించిన విషయం ఏమిటో స్పష్టంగా తెలియలేదు.

 

 

 

 

 

 

ప్రధాన మంత్రి ఆండ్రేజ్ బాబిస్ విలేకరులతో మాట్లాడుతూ ఇది వ్యక్తిగత చర్య. అతను ఇంటికి వచ్చి తాను ప్రజలను కాల్చి చంపానని ప్రకటించాడు మరియు అతను తనను తాను కాల్చుకోబోతున్నాడని  బాబిస్ చెప్పారు. దాడి చేసిన హంతకుడి  తల్లి పోలీసులకు సహకరిస్తోందని  ఆయన అన్నారు.  దాడి తరువాత షూటర్ ఆసుపత్రి నుండి పారిపోయాడు, వందలాది మంది అధికారులు అతని కోసం గాలించారు.  తరువాత అతను తన కారులో తన తలపై తాను  కాల్పులు జరుపుకున్నాడు.   హంతకుణ్ణి  బ్రతికించే  ప్రయత్నాలు విఫలమై  అరగంట తరువాత అతను మరణించాడని ఇంటీరియర్  మంత్రి జాన్ హమాసెక్ చెప్పారు. 

 

 

 

 

 

 

 

హంతకుణ్ణి  సిటిరాడ్ విటాసెక్ గా గుర్తించారు. అతను  నిర్మాణ సాంకేతిక నిపుణుడు గా పని చేస్తాడని,  సంస్థ చైర్మన్ అలెస్ జైగులా గుర్తించారు.    విటసెక్ ఒక నెలకు పైగా వైద్య సెలవులో ఉన్నాడు,  అతను తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడని  మరియు అతనిని వ్యాధిని   నయం చేయడానికి ఎవరూ ఇష్టపడలేదని  జిగులా చెప్పారు.

 

 

 

 

 

 

 

ఈ దాడిలో ఐదుగురు మరణించారని, ఒకరు శస్త్రచికిత్సలో మరణించారని హాస్పిటల్ డైరెక్టర్ జిరి హవర్లెంట్ విలేకరులతో అన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, కాని ఆస్పత్రి  వైద్యులు ఎవరు  గాయపడలేదు అని అన్నారు.  బాధితులను చాల దగ్గరగా  కాల్చి చంపినట్లు ఆయన తెలిపారు. వారంతా పెద్దలే, వారిలో చిన్న పిల్లలు లేరు. బాధితులలో  ఐదుగురు పురుషులు మరియు ఒక మహిళ  వున్నారు.

 

 

 

 

 

 

హంతకుడు 9 మిల్లీమీటర్ల చెక్ చేతి తుపాకీతో కాల్పులు జరపడని, అతను వాడిన  తుపాకీ కి  లైసెన్స్ లేదని  ప్రాంతీయ పోలీసు విభాగం అధిపతి తోమాస్ కుజెల్ తెలిపారు.   నిందితుడు హింస మరియు దొంగతనాలతో సహా క్రిమినల్ రికార్డును కలిగి ఉన్నాడు.  అతన్ని పట్టుకోవడానికి  పోలీసులు రెండు హెలికాప్టర్లను పిలిపించారు.   హెలికాప్టర్ కారు మీదుగా ఉన్నప్పుడు, నేరస్తుడు తన  తలపై తాను  కాల్చుకున్నాడు అని కుజెల్ చెప్పారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: