రాజధాని ప్రాంత రైతుల్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొందన్న వార్తలు వస్తున్నాయి. రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా అన్న మీమాంశ ఇంకా తొలగలేదు. గతంలో దాదాపు 36 వేల ఎకరాల భూమి రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇంకా వాటి తాలూకూ ప్లాట్లు రైతు చేతికి చేరలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొంది.

 

ఈ సమయంలో జగన్ సర్కారు రాజధాని ప్రాంత రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాజ‌ధాని విష‌యంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నార‌ని అసెంబ్లీ సాక్షింగా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ అన్నారు. అమరావ‌తి న‌గ‌రం, ల్యాండ్ పూలింగ్‌లో రైతుల‌నుంచి తీసుకున్న భూముల‌ను డెవ‌ల‌ప్‌మెంట్ చేసి ప్లాట్లు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నామ‌న్నారు. అంతే కాదు.. త్వర‌లోనే అంద‌జేస్తామ‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ వివ‌రించారు. మంత్రి బొత్స ప్రకటనతో రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం నెలకొంది.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ సీఎం చంద్రబాబు రాజధాని పేరుతో దోచుకున్నారని విమర్శించారు. ల‌క్షా 9 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాన‌ని చంద్రబాబు చెప్పి.. ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

 

సుమారు రూ. 840 కోట్లు క‌న్సెల్టెంట్ల‌కు ఎంఓయూలు చేశారని.. దీని ద్వారా రూ.320 కోట్ల ప్రజాధ‌నాన్ని దుర్వినియోగం చేశాడని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏ ముఖం పెట్టుకొని అమ‌రావ‌తికి వ‌స్తాడ‌ని మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: