బైక్ వాడుతున్నారా? అదేం ప్ర‌శ్న‌..ఇవాళ‌, రేపు బైక్ వాడ‌ని ఇళ్లును వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఉంది క‌దా! అంటారా. అవును నిజ‌మే. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బైక్ వాడ‌కం స‌మ‌యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై ఫైన్ల మోత మోగుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేటు కనపడకుండా చేస్తున్నారు. ఇందుకోసం ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌లు వేస్తున్నారు. అంటే నంబర్ సంఖ్యలో ఒక నంబర్‌ను కనపడకుండా చేయ‌డం.. నంబర్ ప్లేటులో అక్షరాలు తొల‌గించ‌డం, సంఖ్యలను తుడిచివేయ‌డం.. సరిగ్గా రాయకుండా ఉండ‌టం....నంబర్లు సరిగ్గా కనపడకుండా చేయ‌డం. నంబ‌రు ప్లేటు వంచ‌డం... ట్రాఫిక్ పోలీసులను చూసినప్పుడు వాటిని కనపడకుండా చేయ‌డం... తప్పుడు నంబర్ ప్లేటు పెట్టుకోవ‌డం...ఇలాగ‌న్న మాట‌. అయితే, ఇలాంటి వారికి పోలీసులు షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. 

 

హైద‌రాబాద్ మెట్రోలో ఫ్రీ వైఫై...అస‌లు షాక్ ఏంటో తెలుసా? 

వాహనం యొక్క‌ నంబరు పేట్లు సరిగ్గా ఉండ‌టం, వాహ‌నం నంబ‌ర్లు స‌మ‌గ్రంగా, పూర్తిగా లేక‌పోతే...ఇకనుంచి ట్రాఫిక్ పోలీసులు వాటిపై 420(మోసం), 465(ఫోర్జరీ) కింద కేసులు నమోదు చేయనున్నారు. చార్జీషీట్లు విచారణకు వచ్చినప్పు డు .. నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ప్లేట్లు పెట్టుకుని ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చేసినా వారంద రూ కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 12,314 మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు వచ్చి, కనపడకుండా తిరిగారని గుర్తించారు. వీరందరీపై సాధారణ చలాన్‌తో పాటు సెక్షన్ 420, 465ల కింద కేసులు నమోదు చేశా రు. వీరందరీపై కోర్టులో తప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ప్లేట్లను పెట్టుకుని తిరుగుతున్నారని నమోదు చేసిన అభియోగాలపై చార్జీషీట్లను దాఖలు చేస్తున్నారు. వీటిలో కోర్టు విచారణలో తప్పు అని నిర్ధారణ అయితే 420 సెక్షన్ కింద 7 ఏళ్లు, 465 కింద 2 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. కావునా..వాహనదారులు తమ నంబర్ ప్లేటు స్పష్టంగా కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.

 

 

పీకే...జ‌గ‌న్‌పై ఖ‌చ్చితంగా నిరాశ‌తో ఉన్నాట్లే క‌దా? 

తప్పుడు నంబర్ ప్లేట్లతో సంచరించే వాహనాలతో తాత్కాలికంగా తప్పించుకున్నామని సంబర పడిపోతుంటారని, అయితే విచారణలో వారు చేసిన తప్పు రుజువైతే ఐసీపీ సెక్షన్‌లు 420, 465 కింద జైలు ఊచలు లెక్కించాల్సిందేని పోలీసులు తేల్చిచెప్తున్నారు. వాహనదారులు ఉద్దేశ్యపూర్వకంగా,నిర్లక్ష్యంగా, పోలీసులకు కనపడకుండా నంబర్ ప్లేట్లను వంచవద్దని, అలా చేస్తే శిక్ష తప్పదంటున్నారు. ఇప్ప‌టికే ఇలా చేసిన వారిని ఫొటోల రూపంలో, సీసీ కెమెరాల రూపంలో బంధిస్తున్నామ‌ని, ఆ దృశ్యాలు, ఫొటోలు మాకు సాక్ష్యంగా విచారణలో నిలుస్తాయని ప్ర‌క‌టించారు. ఇదండి పోలీసుల కొత్త షాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: