మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ కు పెను ప్రమాదం తప్పింది. నారా లోకేశ్ అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వస్తున్న సమయంలో డ్రోన్ కెమెరా నారా లోకేశ్ పై పడింది. డ్రోన్ కెమెరా పై నుండి విద్యుత్ తీగలకు తగిలి కింద పడినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం పోలీసులు ఒక డ్రోన్ ను ప్రయోగించగా ఆ డ్రోన్ అదుపు తప్పి నారా లోకేశ్ ముందు పడింది. పోలీసులు తెలుగుదేశం పార్టీ ధర్నాను చిత్రీకరించేందుకు కెమెరా అమర్చిన డ్రోన్ ను ప్రయోగించారు. 
 
భారీగా శబ్దం చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలకు అత్యంత సమీపంలో డ్రోన్ పడటంతో కొంత కలకలం రేగింది. ఈ ఘటనలో నారా లోకేశ్ తో పాటు దీపక్ రెడ్డి ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. లోకేశ్ బస్సు దిగి నడుస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగా డ్రోన్ కింద పడినట్లు తెలుస్తోంది. లోకేశ్ ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే డ్రోన్ కెమెరా ఆయనపై పడి ఉండేది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 
ఈరోజు నారా లోకేశ్ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తెలుగులో మాట్లాడటంలో లెక్కల్లో చాలా వీక్ అని నారా లోకేశ్ అన్నారు. వైసీపీ నేతలు తనను పప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారని కానీ జగన్ గన్నేరు పప్పు అని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో లేని తనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ స్పీకర్ ఏ మాత్రం స్పందించటం లేదని లోకేశ్ అన్నారు. అమెరికాలో చదువుకున్నానని తెలుగులో చిన్న చిన్న తప్పులు మాట్లాడి ఉండొచ్చని అన్నారు. 
 
నేను వర్ధంతిని జయంతి అంటే అభివృద్ధి ఏమైనా ఆగిపోయిందా...? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. శాసన సభలో తనను అవమానిస్తున్న మంత్రులు శాసనమండలికి వచ్చాక తన పేరు ఎత్తడం లేదని లోకేశ్ అన్నారు. 42 వేల కోట్ల రూపాయలు దోచుకొని జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి నేడు నీతులు చెబుతున్నాడని నారా లోకేశ్ వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ లో తమకు షేర్లు మాత్రమే ఉన్నాయని లోకేశ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: