నేడు మొదలైన అసెంబ్లీ సమావేశం ఉదయాన్నే రసాభాసగా మారిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో... ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అంశంపై గురువారం నాడు సుదీర్ఘంగా చర్చలు జరుపుతామని... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి బుగ్గన సూచించారు. నేడు సభలో  ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలానే ఉన్నాయని ముందు వాటి గురించి చర్చిద్దాం అంటూ తెలిపారు. ఈ చర్చ కాస్త వ్యక్తిగత విమర్శలు వైపు వెళ్ళి పోయింది. ఆ తర్వాత రెడ్డి చెవిరెడ్డి చేసిన  వ్యాఖ్యలు కాస్త  సభలో గందరగోళం సృష్టించాయి.

 

 

 

 ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం అంశంపై ఈ రోజు అసెంబ్లీలో చర్చించాలి అంటూ టిడిపి నేతలు అందరూ పట్టుబట్టారు. దీంతో సభ మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పని చేసిన టిడిపి తప్పు బడుతుంది అంటూ విమర్శించారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద విద్యార్థులు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్ నేర్చుకుని  అభివృద్ధి చెందాలని తాము భావిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాని ప్రవేశ పెట్టవద్దు అంటున్న చంద్రబాబు నిర్ణయం దారుణమని ఆయన అన్నారు. 

 

 

 

 చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయనే దగ్గరుండి మరి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు స్కూళ్లను చంద్రబాబు తమ ప్రభుత్వ హయాంలో ప్రోత్సహించారని ముఖ్యమంత్రి జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బినామీ అయినా నారాయణతో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్   పెట్టింది మరి అభివృద్ధి చేయించారని జగన్ ఆరోపించారు. సమాజంతో పోటీ పడాలంటే పేద విద్యార్థులు అందరికీ ఇంగ్లీష్ అవసరమని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.తమ ప్రభుత్వ  హయాంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెడుతున్నందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నాను అంటూ జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: