రాజకీయ నాయకులు సినిమాల మీద దృష్టి పెట్టడం ఏమో గాని ఇప్పుడు వారితో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం టాలివుడ్ భయపడిపోతుంది. మార్కెట్ భారీగా ఉండటం, పెట్టిన పెట్టుబడికి లాభం భారీగా రావడంతో టాలివుడ్ నిర్మాతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని పెట్టుబడులు పెట్టాలని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.



ఈ నేపధ్యంలో టాలివుడ్ లో ఇప్పుడు కొన్ని భయాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. రాజకీయ నాయకులతో సినిమాలు చెయ్యాలి అంటే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నారట. గతంలో మాదిరి రాజకీయాలు ఇప్పుడు లేవు అనేది వాస్తవం. రాజకీయ కక్షలతో అధికార పార్టీలు ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకరి మీద ఉన్న కక్ష ఇప్పుడు ఇంకొకరి మీద చూపిస్తున్నారు. ఇక నాయకుల వ్యాపారాలు కూడా గతి తప్పాయి.



అక్రమ మైనింగ్, ఎర్ర చందనం వంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్న రంగాలు కావడంతో వాళ్ళు దానిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఆ లాభాలు తీసుకు వెళ్లి టాలీవుడ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఏదైనా తేడా వస్తే మాత్రం... వారిపై కక్షలు తీర్చుకుంటున్నారు.
ఈడి, సిబిఐ, ఏసీబీ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళతో కలిసి మేము సినిమాలు చేస్తే మేము బలైపోతామనే భావనలో నిర్మాతలు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణాలో అధికార పార్టీ మీద ఉన్న కక్ష తో ప్రముఖ నిర్మాతలను ఐటి టార్గెట్ చేస్తుంది అనే ఆరోపణలు వినపడుతున్నాయి.



గ‌త రెండు నెల‌లుగా టాలీవుడ్ లో సినిమా ప్ర‌ముఖుల నుంచి నిర్మాత‌లు, హీరోలు, టెక్నీషియ‌న్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిపై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు వారితో వ్యాపారాల నుంచి బయటకు రావాలని వీలైనంత త్వరగా కేసులు ఉన్న నాయకులకు గుడ్ బాయ్ చెప్పాలని భావిస్తున్నారట టాలీవుడ్ నిర్మాతలు. భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలని వచ్చిన వారికి కూడా కేసులు ఉంటే పెట్టేది లేదని స్పష్టంగా చెప్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: