మనము ఏదైనా ఒక పదార్థము చేసుకుని తినాలంటే అందులో ఉల్లిపాయ పడితేనే టేస్ట్ గా అనిపిస్తుంది. అటువంటి ఉల్లికి ఈరోజు ఎక్కడలేని డిమాండ్ పలుకుతున్నది. ఉల్లి సమస్య ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లేదు ఇండియా వ్యాప్తంగా ఉందని, కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉల్లి మీద పెద్ద గొడవ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎగిరిపడ్డారు. 

 

 

తాజగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఉండవల్లి  శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తీర్చడానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కిలో ఉల్లిపాయల ను  రూ. 25 సరఫరా చేస్తున్నారని తెలియ చేయడం జరిగింది.. ఉల్లి ధర నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఈ విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అని ఘాటుగా విమర్శల వర్షం గురింపించారు. ఉల్లి పాయలు ధరలు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఎక్కువ నిలువ ఉంచు కున్న వారిపై విజలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియచేయడం జరిగింది.

 

 

మరో వైపు  ప్రభుత్వ విప్‌ కోరుముట్లు  శ్రీనివాస్‌  మాట్లాడుతూ.. డిసెంబర్‌12న 2100 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని దిగుమతి , రూ. 3వేల కోట్లతో ధరలు అదుపులో ఉండేటట్లు స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశామని తెలియచేయడం జరిగింది. టీడీపీ  ప్రతి పక్ష పార్టీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుందని, భూతద్దంలో చూస్తున్నదని గుడివాడలో సాంబిరెడ్డి మరణించిన విషయాన్ని కూడా రాజకీయం చేయటం ప్రతిపక్ష పార్టీలకు తగదని అన్నారు.

 

 

ఇక విప్‌ కాపు రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడుతూ.. మహిళా బిల్లుపై చట్టం చేస్తుంటే టీడీపీ నేతలు అరచి గోల గోల చేస్తున్నారు అని తెలిపారు. రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏమి మాట్లాడతరోనని ముందు జాగ్రత్త పడ్డారు. టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారని విమర్శించడం జరిగింది. కనీసం ఇప్పటినుంచైనా చంద్రబాబు వైఖరి మార్చుకోవాలని, టీడీపీ పార్టీలో ఉంటే పలు అవమానాలు పడాల్సీ వస్తుందేమోనని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: