యావత్ ప్రజానీకంలో ఉత్కంఠమైన వాతావరణం నెలకొల్పుతున్న  దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారం పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న నేపథ్యం లో ప్రతి వారిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణలో ఏ మలుపు ఏవిధంగా, తిరుగుతుందోనని అందరిలో ఒకటే టెన్షన్ నెలకొంది.

 

 

ఇక సుప్రీం ధర్మాసనం ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై ఏం చెప్తుందో, ఏరకమైన తీర్పు ఇస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచాలని, అప్పటివరకూ అంత్య క్రియలేవీ నిర్వహించవద్దని  ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

 

బుధవారం ఈ కేసుపై విచారణ సుప్రీంకోర్టులో ఉండడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను గత 5 రోజుల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో భద్ర పర్చారు.  ఇవి మరో మూడు రోజులు ఇక్కడే ఉండనున్నాయి. ఇకపోతే ఎన్‌కౌంటర్ వ్యవహారంపై మొత్తానికి శుక్రవారం తుది తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ఆ సమయానికి నిందితుల కుటుంబాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

 

 

మరోవైపు నిందితుల స్వగ్రామాల్లో పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఇంకోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై విచారణను పూర్తి చేశారు. వీరు విచారణలో భాగంగా నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వయసు ధ్రువీకరణ సర్టిఫికేట్లను సేకరించారు.

 

 

దీంతో పాటు మృతదేహాల పోస్టుమార్టం నివేదికలను అధ్యయనం చేశారు.. ఇక ఇప్పటికే దేశాన్నే కుదిపేసిన  ‘దిశ’ హత్యాచారం నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై తెలంగాణ పోలీసులకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు దక్కిన ఎన్‌కౌంటర్‌ పై జరుగుతున్న దర్యాప్తులో మాత్రం పోలీసులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. ఈ రోజుతో అయినా వీరికి ఈ చిక్కుముడి వీడుతుందో లేదో చూడాలంటున్నారు కొందరు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: