ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మూడో రోజున అధికార వైసిపి, విపక్ష టిడిపి నేతల మధ్య అదిరిపోయే రేంజ్ లో నడిచింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య జరిగిన మాటల యుద్ధం హైలెట్‌గా నిలిచింది. తెలుగు మీడియం సందర్భంగా చర్చ జరుగుతున్నప్పుడు టిడిపి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తమకు ఒకరి తర్వాత మరొకరు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు స్పీకర్ త‌మ్మినేని స్పందిస్తూ ఇదేమైనా ఖ‌వ్వాలి డ్యాన్సా ? ఒకరి తర్వాత మరొకరి కి అవకాశం ఇవ్వటానికి అని కాస్తంత అసహనం వ్యక్తం చేశారు.

 

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి మర్యాదగా మాట్లాడాలని స్పీకర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంట‌నే తమ్మినేని సైతం బాబుకు వార్నింగ్ ఇచ్చారు. స్పీక‌ర్ కుర్చీ అంటే గౌర‌వం లేదా ? అని ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీలో రెండు పార్టీ నేతల మధ్య యుద్ధ వాతావరణం నడిచింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు టిడిపికి చెందిన మహిళా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కి తీవ్ర అవమానం ఎదురైంది.

 

ఏపీ అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర.. టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి నుంచి చీఫ్ మార్షల్ ఫ్లకార్డులను లాగేసుకున్నారు. అంతేకాదు.. మిగతా సభ్యుల వద్ద ఉన్న ఫ్లకార్డులను తీసుకోవాలంటూ మార్షల్స్‌కు చీఫ్ మార్షల్ ఆదేశాలిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. మార్షల్స్ తీరుపై మండిపడ్డారు.
దీంతో సంధ్యారాణి త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై చిన్న బుచ్చుకున్నారు.

 

ఇక మార్షల్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీలు అసెంబ్లీ కౌన్సిల్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. మార్ష‌ల్స్ త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రిగా లేద‌ని.. తమ పట్ల మార్షల్స్ అసభ్యంగా.. అమర్యాదగా ప్రవిర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గేట్లు మూసివేసి మ‌రీ త‌మ చేతుల్లో కాగితాలు చించేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. త‌మ చేతుల్లో కాగితాలు చించేయ‌డంతో పాటు అర చేతులు చూపించాలి అని వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చీఫ్ మార్షల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని టీడీపీ మహిళ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: