దిశ..  వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నిందితులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోనివ్వకుండా చంపేశారు ఆ నీచులు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ నిందితులను కేవలం 24 గంటల్లో గుర్తించి చేశారు. 

 

దీంతో ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి ఆ నీచులను మాకు అప్పగించండి మేము చంపేస్తాం అంటూ వారి కోపాన్ని వ్యక్తం చెయ్యగా పోలీసులు ఆ నీచులను కేసు రీకంస్ట్రక్షన్ అంటూ ప్రియాంక అత్యాచారానికి గురైన ఘటన స్థలానికి తీసుకురాగా.. ఆ నీచులు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నీచులపై ఎన్కౌంటర్ జరిపి చంపేశారు. 

 

అయితే ప్రస్తుతం ఆ ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ గురించి పక్కన పెడితే.. ఆ నలుగురు నిందితులు జైల్లో దాదాపు వారం రోజులు ఉన్నారు. ఆ వారం రోజులు జైల్లో ఆ నిందితులు ఏదో పెళ్ళికి వచ్చినట్టు కాస్తకూడా పశ్చాతాపం లేకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు సమాచారం. 

 

అంతేకాదు.. ఆ నిందితులు కూడా మనల్ని ఎం చెయ్యరులే.. ఎన్ని కేసులు ఇలా జరగలేదు ? ఎవరికైనా చంపేశారా ? ఎంత చేసిన చంపారులే అని.. ఒకవేళ మనకు ఉరిశిక్ష పడిన మనం హైకోర్టు, సుప్రీం కోర్టు.. క్షేమ బిక్ష అంటూ కొన్ని సంవత్సరాలు తిప్పచ్చులే ఎం కాదు అని ఒకరికొకరు ఓదార్చుకున్నారని సమాచారం. 

 

ఈ మాటలు.. అమ్మాయిని అత్యాచారం చేసినందుకు కనీస పశ్చాతాపం కనిపించనందుకే వారు అంత దారుణంగా చచ్చారు అని అంటున్నారు. ఏది ఏమైనా.. వారు అనుకున్న మాటలు అన్ని నిజాలే.. విల్లు అంటే పారిపోడానికి ప్రయత్నించి ఎన్కౌంటర్ గురయ్యారు కానీ నిర్భయ నిందితులు లాంటి వారు మన దేశంలో ఎంతమంది ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: