వైఎస్ జగన్ పాలనలో ఇప్పటి వరకూ మొత్తం 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు వైసీపీ మంత్రులు.. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడం దేశంలోనే ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఇది చారిత్రాత్మకం అంటూ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ఈ విషయాన్ని.. లక్షల ఉద్యోగాలు చరిత్రలో తొలిసారి అంటూ ఈనాడు కూడా కథనాలు రాసిందని ఆయన చెప్పారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ బాబొస్తే జాబొస్తుందని చెప్పిన గత ప్రభుత్వపు ముఖ్యమంత్రిలా కాదు. వైయస్ జగన్ వచ్చిన మూడునెలలలోనే లక్షలాది ఉద్యోగాలను అందించి రికార్డు సృష్టించారు. సచివాలయం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి మానసపుత్రిక. గ్రామ సచివాలయాలు రావడానికి ముఖ్య కారణం జన్మభూమి కమిటీల పేరుతో జరిగిన అక్రమాలు, ఆశ్రిత పక్షపాత కేటాయింపులు, పార్టీకి సంబంధించిన వారికే పథకాలు అందించడం అంటూ వివరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

పేదలందరికీ పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అందాలని, పేదరికమే కొలబద్దగా ఉండాలి తప్ప కుల, మత ప్రాతిపదిక ఉండకూడదని, పథకాల అమలు పారదర్శకంగా జరగాలని సచివాలయాలను ఏర్పాటు చేసారు. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన, కొండ ప్రాంతాల్లోనూ జనాభా ప్రాతిపదికన కాకుండా 2000మందికంటే తక్కువ జనాభా ఉన్న ఊరిలో సచివాలయాలు ఏర్పాటు చేసాం. 11158 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.

 

మొత్తం 14,944 సచివాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో అన్ని శాఖలకూ సంబంధించి 12 నుంచి 14 దాకా విలేజ్ సెక్రటరీలు ఉంటారు. వీరు కోఆర్డ్ నేట్ చేసి ప్రజలకు అందాల్సిన పథకాలను అందేలా చేస్తారు. పంచాయితీ సెక్రెటరీ, విఆర్‌వో, సర్వే అసిస్టెంటు, ఎఎన్‌ఎమ్‌, వెటర్నరీ అసిస్టెంట్, మహిళా పోలీసు, ఇజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ లైన్ మేన్, విలేజ్ అగ్రి అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 4, వెల్ఫేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, కల్చరల్ అసిస్టెంట్ ఇలా 14 శాఖలకు చెందిన సెక్రటరీలు సచివాలయంలో అందుబాటులో ఉంటారు.. అంటూ మంత్రి వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: