ఏపీలో జగన్ ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రిక విషం చిమ్ముతోందా.. కావాలని దుష్ప్రచారం చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉపాధి అవకాశాలు కల్పించినా.. ఆ క్రెడిట్ జగన్ కు రాకుండా కుట్రలు చేస్తోందా.. అవునంటున్నారు వైసీపీ మంత్రులు.. ఈ విషయం ఏకంగా అసెంబ్లీలోనే కుండబద్దలు కొడుతున్నారు.

 

ప్రత్యేకించి సచివాలయ ఉద్యోగాల విషయంలో పేపర్ లీకైందని .. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆంధ్రజ్యోతి పనికట్టుకుని విష ప్రచారం చేసిందని వైసీపీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఆయన అసెంబ్లీలో ప్రసగించారు. ఆయన ఏమన్నారంటే.. “

పరీక్షా ఫలితాల రోజు సాయంత్రం పేపరు లీకైందంటూ ఆంధ్రజ్యోతి పెద్ద ఎత్తున యాగీ చేసింది. నిజంగా పేపర్ లీక్ అయితే పరీక్షలు జరిగే సమయంలో లేదా మరుసటిరోజు తెలుస్తుంది. కానీ ఫలితాలు వచ్చిన రోజు పేపర్ లీక్‌ అంటూ చేసిన ప్రచారం ఖచ్చితంగా విషప్రచారమే.

 

ముఖ్యమంత్రిగారి స్వీయ పర్యవేక్షణలో, పారదర్శకంగా, చిన్న సమస్య కూడా తలెత్తకుండా పరీక్షలు నిర్వహించాం. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ద్వారా జనరల్ నాలెడ్జ్, మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, విలేజ్ సెక్రట్రీ, వార్డ్ ఎడ్మినేస్ట్రేటివ్ సెక్రెటరీ పేపర్లను తయారుచేయించాం.

 

ఇంజనీరింగ్ అసిస్టెంటు, డీజిల్ అసిస్టెంట్ JNTU అనంతపురం వార్డ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పేపర్లు ఆ డిపార్టుమెంట్ వారే సిద్ధం చేసారు. అగ్రికల్చర్, హార్టీకల్చర్, ANM మొదలైనవి ఆయా విభాగాలే నిర్వహించాయి. సర్వేయర్, వీఆర్వో పరీక్షాపత్రాలు రెవెన్యూ డిపార్టుమెంట్ చేసింది. ఈ విభాగాలన్నీ మూడు సెట్ల పేపర్లను సీల్డ్ కవర్లలో ఇచ్చి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు ఇచ్చాయి.

 

వారు ప్రింటింగ్ మిషన్ వద్ద పేపర్లను ప్రింట్ చేయించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో, కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో పేపర్లను భద్రంగా ఉంచడం జరిగింది. పరీక్షల అనంతరం ఓఎమ్‌ఆర్ షీట్లన్నిటినీ సెక్యూరిటీతో పాటుగా నాగార్జునా యూనివర్సిటీకి తరలించడం జరిగింది. అక్కడ డేటా టెక్ మెథాడిక్ సొల్యూషన్స్ ద్వారా వీటిని ఎవాల్యూట్ చేయించారు. ఇందులో 10% ఓఎమ్‌ఆర్ షీట్లను రాండమ్ గా డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ దగ్గర వెరిఫై చేయించడం జరిగింది. ఇంత భద్రతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాము. ఇదంతా జరిగినప్పుడు సాఫీగా సచివాలయ పరీక్షలు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది. ప్రశాంతంగా పరీక్షలు అని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు ప్రచురించింది.. అంటూ సభలో మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: