దేశంలో ప్రతీ రోజూ , ప్రతీ చోటా ఎదో ఒక ఇంట్లో ఉండే అత్తా మామా, తల్లి తండ్రులు వేదించ బడుతూనే ఉంటారు. అందరూ ఉన్నా అనాధలుగా బ్రతుకుతూ, ఆస్తి పాస్తులు ఉన్నా సరే గుప్పెడు మెతుకులు పెట్టకుండా వేధించుకుతినే ప్రభుద్దులు మనకి తారస పడుతూనే ఉంటారు. ముసలి వాళ్ళని చూడకుండా కాళ్ళతో తన్నడం, చిత్ర హింసలు పెట్టి చంపేసే కన్న కొడుకుల, కూతుళ్ళని చూస్తూనే ఉంటాం.  అయితే అలాంటి నీచులకి కాలం చేల్లినట్టే, ఇకపై సీనియర్ సిటిజన్స్ ని ఇబ్బంది పెట్టె ఆలోచన వస్తేనే భయపడి పోయేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది.

 

తల్లితండ్రులు, అత్తమామలు, సీనియర్ సిటిజన్స్ విషయంలో క్రురంగా వ్యవహరిస్తే ఇకపై జైల్లో చిప్పకూడు తినక తప్పదని,అందుకు తగ్గట్టుగా చట్టాని తీసుకువచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు లోక్ సభలో తల్లి తండ్రులు, సీనియర్ సిటిజన్స్ బిల్లు ని ప్రవేశపెట్టింది. ఈ నేరాలకి పాల్పడే వారికి ఆరు నెలలు  జైలు శిక్ష లేదా రూ. 10 వేల జరిమానా విధిస్తారని తెలిపింది. అంతేకాదు..కేసుని బట్టి ఒక్కో సారి రెండూ విధించే అవకాశం ఉందని కేంద్రమంత్రి తావర్ చాంద్ గెహ్లాట్ తెలిపారు. మంత్రి స్వయంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టారు.

 

తమ సంరక్షణలో ఉండే తల్లి తండ్రులని లేదా స్వచ్చంద సంస్థలలో ఉండే అనాధ సీనియర్ సిటిజన్స్ ని దూషించినా, తిండి, బట్ట ఇవ్వకుండా, సరైన వైద్యం చేయించక పోయినా సరే ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. ఈ చట్టం ప్రకారం 60 ఏళ్ళ నుంచీ 80 ఏళ్ళు పైబడిన వృద్దుల కేసులని ఈ ట్రిబ్యునల్ పరిష్కరించాలి. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఈ కేసుని 3 రోజుల వరకూ పొడిగించే వీలు ఉంది. అంతేకాదు ప్రతీ పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు పరిష్కరించడానికి ఏ ఎస్సై హోదాలో వ్యక్తిని నియమించాలని, అలాగే ప్రతీ రాష్ట్రంలో ఉండే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని బిల్లులో పొందుపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: