దిశ హత్యాచార ఘటన జరగడానికి సరిగ్గా మూడు రోజుల ముందు తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా లోని లింగంపల్లి మండలంలో సమత అనే ఒక దళిత మహిళ అత్యాచారానికి గురై అతి కిరాతకంగా హత్య చేయబడిన ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగితే రాజకీయ నాయకులు, మీడియా వారు మరియు ప్రభుత్వం స్పందిస్తున్నారని మరియు సామాజిక హోదా తక్కువగా ఉన్న ఈ మహిళకు ఆసిఫాబాద్ లో జరిగితే మాత్రం ఎవరు కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆ గ్రామంలోని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

 

దిశ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేయకుండానే విచారణ పేరుతో బయటికి తీసుకుని వచ్చి ఎన్ కౌంటర్ చేసిన వారు ఎటువంటి రాజకీయ పలుకుబడి మరియు సామాజిక హోదా లేని ఈ బాధితురాలి విషయంలో మాత్రం కనీసం ఇప్పటికీ కేసు నమోదు చేయకపోవడం ఏమిటి అని దళిత సామాజిక వర్గాలు గొంతెత్తి ప్రశ్నిస్తున్నాయి. ఏదో పిల్లలు ఆడుకునే బుడగలు మరియు బొమ్మలు అమ్ముకొని బ్రతుకుతున్న ఆమెను అడవిలోకి లాక్కెళ్లి నిర్దాక్షిణ్యంగా శరీరం మొత్తం రక్తమయం చేసిన రాక్షసులకు ఇంకా శిక్ష పడక పోవడానికి కారణం ఏమిటని అటు మీడియా తో పాటు ఇటు సామాజిక వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. 

 

ఇటువంటి సమయంలో బాధితురాలి భర్త మాట్లాడుతూ ఇద్దరం పొట్టకూటి కోసం రాత్రి పగలు రోడ్లపై తిరుగుతూ ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటామని... అటువంటిది తన భార్య ఒంటి చేతి గోరు ఘాట్లతో చీరేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితురాలి అత్త మాట్లాడుతూ తన కోడలి శరీరం చూస్తే అది ఆడమనిషిలాగే లేదని ఇంకా తన కోడలను ఒక బొమ్మలు ఆడుకున్నారని వాపోయింది. కానీ ఈ విషయమై మీడియా కవరేజ్ అంతంత మాత్రంగా ఉండగా ఏ రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: