ఈ కాలంలో వాట్సాప్ వాడని వారంటూ ఉండరు.. ఒంటిమీదకు 12 ఏళ్ళు వచ్చాయంటే చాలు వాట్సాప్ వాడటం మొదలు పెడుతారు. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు తిండి, నీరు, నిద్రలాగా వాట్సాప్ కూడా ఒక భాగం అయిపోయింది. అలాంటి వాట్సాప్ వినియోగదారులకు ఓ సంచలనమైన వార్త. ఆ వార్త వింటే గుండెలు మిగిలిపోతాయి అంతటి సంచలనమైన వార్త అది. 

                                     

అంత సంచలనమైన వార్త ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకేం వార్త అండి.. అదేనండి బాబు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో వాట్సాప్ వినియోగదారులకు దగ్గర అయ్యే వాట్సాప్ వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదు. ఇప్పటికే కొన్నిపాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అతి త్వరలో మరికొన్ని ఫోన్లలోనూ నిలిపేసేందుకు సన్నాహాలు చేస్తోంది వాట్సాప్‌. 

                                 

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ పాత వర్షన్‌ ఉన్న ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ వివరాలను వాట్సాప్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 2,3,7 కన్నాతక్కువ వర్షన్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంటే మీ ఫోన్‌లో వాట్సాప్‌ పనిచేయదు. అలాగే ఐఓఎస్ 8 కన్నా తక్కువ వర్షన్ ఓఎస్ ఉన్నా ఇదే పరిస్థితి. దీంతో ఈ ఫోన్లు వాడుతున్నవారు వెంటనే కొత్త ఫోన్ తీసుకోవడం మంచిది. ఏదిఏమైనప్పటికి.. పాత వర్షన్స్ వాడే వారికీ ఈ వార్త గుండెపగిలే వార్త అనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే కొత్త ఫోన్ కోనేయండి.. లేకపోతే వాట్సాప్ పనిచేయదు మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: