తెలుగుదేశం పార్టీని ముంచింది ఎవరూ అంటే... ముందు ఎక్కువగా వినపడేది సీనియర్ నేతలే... పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నేతలు... ఆ పార్టీకి భారంగా మారిపోయారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు వంటి నేతలు పార్టీకి ఎక్కువ భారంగా మారిపోయారని పలువురు ఆరోపణలు చేసారు. పార్టీలో తమ మాటే చెల్లాలి అనే చందంగా వాళ్ళు వ్యవహరించడం, చంద్రబాబు వాళ్లకు ప్రాధాన్యత

ఇవ్వడం, యువనేతలకు ప్రాధాన్యత తగ్గించడం వంటివి చంద్రబాబు చేశారు. 

 

బలమైన నియోజకవర్గాల్లో వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సీనియర్ అనే పేరుతో తూర్పు గోదావరి జిల్లాలో యనమల మాట దాటి వెళ్ళలేని పరిస్థితి ఆ పార్టీకి నెలకొంది. రాజకీయంగా బలంగా ఉన్నా సరే అక్కడ పార్టీలో ఆయన పెత్తనం ఎక్కువగా ఉండటంతో పని చేసే వాళ్ళు కూడా దురం అయ్యారు. ఇక సోమిరెడ్డి వరుసగా ఆరు సార్లు ఓటమి పాలయ్యారు. 

 

అయినా సరే చంద్రబాబు ఆయన విషయంలో సానుకూలంగా ఉండటం, కీలక బాధ్యతలు ఇవ్వడం, ఆయన మాటకు విలువ ఇవ్వడం చాలా మందికి మండింది. దీనితో నెల్లూరు జిల్లాలో పార్టీ కోసం పని చేసిన వారు కూడా ఆయన వల్ల‌ దూరం అయ్యారు. ఇప్పుడు సినిమా అర్ధమైన చంద్రబాబు... వాళ్ళను పక్కన పెట్టారని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్పినా సరే చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

ఈ నేత‌ల మాటల‌కు ఎక్కడా ప్రాధాన్యత చంద్రబాబు ఇవ్వడం లేదని, పార్టీలో సైలెంట్ గా ఉండమని చెప్పారని అంటున్నారు. అందుకే సోమిరెడ్డి కొంత కాలంగా ఏమీ మాట్లాడటం లేదని త్వరలోనే యనమలను కూడా చంద్రబాబు తప్పించే అవకాశం ఉందని... ఆ తర్వాత రాష్ట్ర బాధ్యతలను... రామ్మోహన్ నాయుడు కి ఇచ్చి... కళా వెంకట్రావు కి చెక్ పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: