ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే సాక్షి మీడియాపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ దీక్ష చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షలో ప‌వ‌న్ హాట్ కామెంట్లు చేశారు. దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు. 

 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!

 

ఈ దీక్ష‌కు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు  చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా జనసేనాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాకినాడ రైతు సౌభాగ్య దీక్ష వేదికపై ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్న బియ్యాన్ని శాంపిల్స్ ను   పవన్ కళ్యాణ్‌కు జనసేన నాయకుడు లీలాకృష్ణ అందచేశారు. ప్రభుత్వం ఇస్తానని వాగ్దానం చేసిన అసలైన సన్న బియ్యం శాంపిల్స్ కూడా ఆయ‌న జనసేనానికి చూపారు. ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి గారు ఇంటింటికీ తీసుకువచ్చి ఇస్తామన్న బియ్యం ఏది? వారు చెప్పిన అసలు బియ్యం ఏది? అని జనసేన నాయకుడు లీలాకృష్ణను పవన్ కళ్యాణ్ గారు అడిగారు. లీలాకృష్ణ ఆ బియ్యాన్ని చూపించారు. 

 

నేను కేటీఆర్ పీఏను...ఓ 90 వేలు అడ్జెస్ట్ చేస్తారా ప్లీజ్‌

 


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ `మా పేపర్ తప్పు చేసింది నాకు సంబంధం లేదని సీఎం అన్నారే` అంటూ ఎట‌కారం ఆడారు. `ఆయన పేపర్లో వేసేవి అన్నీ తప్పులే కదా సర్` అంటూ లీలాకృష్ణ బదులిచ్చారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: