జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అమలు చేయాలనే ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ నిర్ణయాన్ని నిండుసభలో ఆయన ప్రశంసించారు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మ‌రోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షను చేపట్టగా దానికి రాపాక వరప్రసాద్ డుమ్మాకొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున తాను రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కావట్లేదని ఆయన వెల్లడించారు. ఇలా క‌ల‌క‌లం రేపే కామెంట్ల‌తో రాపాక వార్త‌ల్లో నిల‌వ‌గా..ఆయ‌నకు షోకాజ్ నోటీసు జారీ అయింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. 

 

సాక్షిపై ప‌వ‌న్‌కు ఇంత క‌డుపు మంట ఉందా?

 

కాకినాడ‌లో దీక్ష విజ‌య‌వంతం అయింద‌ని, అయితే పార్టీ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ స‌మావేశానికి రాని ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తున్నామ‌ని...జ‌న‌సేన పేరుతో ప్ర‌క‌ట‌న వైర‌ల్ అవ‌డంలో ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. నాకు ఎవరో షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నేను గెలిచిన ఎమ్మెల్యేను.. వాళ్లు ఓడిపోయిన వారు అంటూ ప‌వ‌న్‌పై జ‌న‌సేన ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ``నాకు షోకాజ్  మరీ విచిత్రంగా ఉంది.. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉంది అంటే నాకు మాత్రమే ఉంది. జనసేన  పార్టీ వల్ల, ఆ కార్యకర్తల వల్ల నేను గెలవలేదు..నేను ఎవరి భిక్షతో ఎమ్మెల్యే కాలేదు. నా సొంత శక్తితో ఎమ్మెల్యేగా గెలిచాను తప్ప నాకు ఎవరి భిక్ష అవసరం లేదు.` అంటూ పార్టీపై విరుచుకుప‌డ్డారు.

 

బాబుకు బాల‌య్య అదిరిపోయే షాక్‌...బాబు ఇంత‌కంటే ఏం చేస్తాడు మ‌రి!

 

`త‌న‌ను గెలిపించే వాళ్లే అయితే ఆయన ఎందుకు ఓడిపోయారు రెండు చోట్లా? ముందు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి.` అని ప‌వ‌న్‌ను డైరెక్ట్ అటాక్ చేశారు. `నన్ను ఆయన సస్పెండ్ చేయడం ఏంటి? సిగ్గుగా ఉంది ఈ మాట చెప్పుకోవడానికి కూడా.. దిశానిర్దేశం లేని పార్టీ లో ఉండటం నాకే ఇష్టం లేదు..నేను రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి నాకు ఉంది..ఆయనకు రాష్ట్రంలో ఎక్కడైనా గెలిచే సత్తా ఉందా అని అడుగుతున్న?` అంటూ ప‌వ‌న్‌ను నిల‌దీశారు. `ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు,,షోకాజ్ నోటీసులు అంటూ చెత్త ప్రకటనలు చెత్త పేపర్లలో విడుదల చేస్తే నేను ఏమి చేయాలో నాకు తెలుసు.` అంటూ రాపాక వరప్రసాద్ విరుచుకుప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: