దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విష‌యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిశ హ‌త్య ఉదంతం అనంత‌రం దిశ నిందితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళితే వారు అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంత‌రం వారి శ‌వాల‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయినవారి మృతదేహాలను హైకోర్టు ఆదేశాల మేరకు అలాగే భద్రపర్చాలని, తాము తదుపరి ఆదేశాలిచ్చేవరకు హైకోర్టు ఆదేశాలే కొనసాగుతాయని సుప్రీకోర్టు స్పష్టంచేసింది. అయితే, గాంధీ మార్చురీలో నిందితుల మృత‌దేహాలు కుల్లు కంపుకొడుతున్నాయ‌ని సమాచారం. 

 

65 ఏళ్ల‌ ముస‌లోడికి పోరీల పిచ్చి..73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి ఏం చేశాడో తెలుసా?

 

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరిచే అంశంపై గురువారం కొంత సందిగ్ధం నెలకొన్నా.. సుప్రీంకోర్టు ఆదేశాల కాపీ బయటికి రావడంతో సందేహాలు నివృత్తి అయ్యాయి. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ కేసులో గురువారం విచారణ జరిగిన సమయానికి సుప్రీంకోర్టు తీర్పు కాపీ పూర్తిగా బయటకు రాలేదు. దీంతో మృతదేహాల విషయంలో స్పష్టతలేదని ధర్మాసనం భావించింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ బండా శివానందప్రసాద్‌ను చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు తీర్పు కాపీలో మృతదేహాలను తమ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు భద్రపర్చాలని ఉండటంతో సందిగ్ధం తొలిగిపోయింది.

 

సొంత ఇళ్లు కూల్చి..షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం...బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యానికి కార‌ణం ఆయ‌నేనా? 

 

దిశ నిందితులను కావాలని ఎన్‌కౌంటర్ చేశారని మహిళా సంఘాల నేతలు, పౌర హక్కుల సంఘాల నేతలు హైకోర్టుకు లేఖలు రాశారు. వాటిని పిల్‌గా పరిగణిస్తూ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది . నిందితుల డెడ్ బాడీలను ఈ నెల 13వ తేదీ వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రరపరచాలని ఆదేశించింది. అయితే, గాంధీ ఆస్ప‌త్రి మార్చురీలో త‌గు ఏర్పాట్లు ఉన్నప్ప‌టికీ...గ‌తంలో ఉంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆస్ప‌త్రిలో స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంతో డెడ్‌బాడీలు వాసన వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో వాటిని ప్ర‌త్యేకంగా భ‌ద్ర‌ప‌రిచేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: