మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ వైఎస్ జగన్ సంచలనాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ 1400 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రతీ పనికి కమిషన్లకు కక్కూర్తి పడి 4 శాతం అధనంగా ప్రాజెక్టులను అప్పజెప్పారు అని చెప్పారు అనిల్. గతంలో ఏ కంపెనీలు అయితే టెండర్లు పొందాయో ఇప్పుడు అవే కంపెనీలు గతంలో కోట్ చేసిన మొత్తంపై 6.5 శాతం తక్కువకు టెండర్లు కోట్ చేశాయని చెప్పారు. 

 

ఇళ్ల నిర్మాణాల్లో రూ 105 కోట్లు, ఆల్తూరుపాడు ప్రాజెక్టులో రూ 67 కోట్లు, పోలవరం ప్రాజెక్టులో రూ 750 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గతంలో ఆల్తూరుపాడు ప్రాజెక్టులో రూ 250 కోట్లకు ప్రాజెక్ట్ ను కేటాయించగా ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ ద్వారా 26 శాతం తక్కువకు అదే కంపెనీ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది, దీని ద్వారా రూ 67 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన పోలవరంలో రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రూ 750 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇలా మొత్తంగా రివర్స్ టెండరింగ్ ద్వారా రూ 1400 కోట్లను ఆదా చేశామని చెప్పారు. 

 

కేవలం మీరు నలుగురు లేదా ఐదుగురు జేబులు నింపిన ఈ డబ్బులతో 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితుల సమస్య తీరింది, ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు ఈ డబ్బు ఉపయోగపడింది అని చెప్పారు మంత్రి అనిల్. జగన్ గారి ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఫిర్యాదులు చెయ్యడానికి ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించామని చెప్పారు. అవినీతికి పాల్పడితే అధికార పక్షమైన సహించొద్దు అని ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్ మాత్రమే అని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: