సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం రాజధాని నగరంలో భారీ నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డిసెంబర్ 15 నుంచి 17 వరకు గువహతిలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీజపాన్ ప్రధానమంత్రి  షింజో అబేల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశం రద్దు చేయబడింది.  

 

 

 

 

 

శిఖరాగ్ర సమావేశం కోసం అబే పర్యటనను,  పరస్పరం అనుకూలమైన తేదీకి వాయిదా వేయాలని భారత్, జపాన్ దేశాలు నిర్ణయించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.   జపాన్ ప్రధాని అబే భారతదేశానికి ప్రతిపాదించిన సందర్శన గురించి, సమీప భవిష్యత్తులో పరస్పర అనుకూలమైన తేదీకి సందర్శనను వాయిదా వేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి  అని ఆయన శిఖరాగ్ర సమావేశానికి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

 

 

 

 

బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన  ముస్లింలకు  కాకుండ, ఆ దేశాల వేరే మత ప్రజా లకు  పౌరసత్వం వర్తించేటట్టు  కొత్తగా సవరించిన చట్టంపై అస్సాం హింసాత్మక నిరసనలకు దిగింది.  పౌరసత్వం (సవరణ) బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించగా, రాజ్యసభ బుధవారం దానిని క్లియర్ చేసింది. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ గురువారం తన అంగీకారం ఇచ్చిన తరువాత ఇది చట్టంగా మారింది.

 

 

 

 

 

అస్సాం లో  పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో అబే గువహతికి వెళ్లడం సాధ్యం కాదని, జపాన్ ప్రభుత్వం న్యూ ఢిల్లీ కి  స్పష్టంగా తెలియజేసిందని దౌత్య వర్గాలు తెలిపాయి.   వచ్చే ఏడాది శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని వారు తెలిపారు.    విదేశాంగ మంత్రిత్వ శాఖ  గత వారం అబే సందర్శన తేదీలను ప్రకటించినప్పటికీ వేదిక గురించి ప్రస్తావించలేదు. అయితే, ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశానికి గువహతిలో సన్నాహాలు జరుగుతున్నాయి.   జపాన్ బృందం బుధవారం గువహతిని సందర్శించిన  తర్వాత ప్రస్తుత పరిస్థితులలో అబే పర్యటన ముందుకు సాగదని టోక్యో ,  విదేశాంగ మంత్రిత్వ   శాఖ కి స్పష్టంగా తెలియజేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: