ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ శ్రేణులపై  దాడులకు పాల్పడుతున్నది  అంటూ టీడీపీ నేతలు అందరూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని విమర్శలు గుప్పిస్తోంది టిడిపి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎస్ ను  బదిలీ చేసింది అంటూ టీడీపీ గతంలో విమర్శలు చేసిన విషయం తెలిసింది. తాజాగా ఏపీలో ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ సస్పెండ్ చేయడం కూడా ఆంధ్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. వైసీపీ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అంటూ టీడీపీ నేతల విమర్శల పర్వం కాస్త ఇంకా ఎక్కువ అయిపోయింది. 

 

 

 కావాలనే  జగన్ ప్రభుత్వం ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ని సస్పెండ్ చేసింది అని ఆరోపిస్తూ టీడీపీ నేతలు అందరూ జగన్ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు అసెంబ్లీలో కూడా ఈ అంశం పై చర్చిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు. కక్ష సాధింపు చర్యల్లోనే వైసిపి ప్రభుత్వం ఐఏఎస్ అధికారి కృష్ణ కిషోర్ సస్పెండ్ చేసింది అంటూ విమర్శలు చేస్తున్నారు . ఇప్పుడు తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి స్పందించి జగన్ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఓ  ఫ్యాక్షన్ నేత అధికారం చేపడితే ఎలా ఉంటుందో.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే ఉంది అంటూ ఆరోపించారు... 

 

 

 జగన్ చరిత్ర చూస్తే ఆయనొక  నేరస్తుడు... ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయి అంటూ బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావడం ఆంధ్రప్రదేశ్ యొక్క దురదృష్టమో...లేక ప్రజల  అదృష్టమో తెలియదు కానీ... ప్రజలు జగన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపించారు అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కి వచ్చినప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ తత్వాన్ని వదల లేదంటూ ఆరోపించారు. సీఎం జగన్ రాజకీయంగానే  కాదు అధికారుల పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు టిడిపి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగిందని...  కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు అంటూ ఆయన విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: