ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక లోటు ఉన్నా సరే పరిపాలన విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఆర్ధిక లోటు ఉన్నా సరే అమలు చేస్తూ పరిపాలనలో దూసుకుపోతుంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే జగన్ సర్కార్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన ప్రతీ హామీని జగన్ అమలు చేస్తున్నారు. వాహన మిత్ర, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయి... అమ్మ ఒడి ప్రారంభించాల్సి ఉంది.

 

ఇక ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలను కొందరు ఇతర రాష్ట్రాల ఎంపీలు వీటిపై అడిగారు. ఏ విధంగా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు కూడా వేసినట్టు వార్తలు వచ్చాయి. ఆర్ధికంగా అన్ని వనరులు ఉన్న తమ రాష్ట్రాలు ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నాయని, అప్పులు ఉన్న మీ రాష్ట్రం ఏ విధంగా అమలు చేస్తుంది అనే ప్రశ్నలు ఎక్కువగా ఎంపీలకు ఎదురు అయ్యాయి. కొందరు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డిని అభినందించారు కూడా.

 

ఇప్పుడు వీటిపై తెలంగాణాలో కొందరు సీనియర్ మంత్రులు ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమకు హైదరాబాద్ ఉండి భారీగా ఆదాయం ఉండి కూడా తాము అమలు చేయడంలో వెనకడుగు వేస్తున్నామని రెండు వేల పించన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నామని అలాంటిది ఏ ఆదాయం లేని రాష్ట్రంలో జగన్ ఎలా అమలు చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆయన ఈ స్థాయిలో ఏ విధంగా వెళ్తున్నారు అంటూ ఆరా తీస్తున్నారట. ప్రభుత్వంలో తమ సన్నిహితుల ద్వారా చివరకు ఉల్లిని ఏ విధంగా తక్కువకు ఇస్తున్నారు అనేది కూడా ఆరా తీసినట్టు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: