సాధారణంగా మన దేశంలో ఉల్లి ధరలు కాకా పోతే టమాట కాకపోతే  ఉల్లి ఇలా ఒకటి కాకపోతే మరొకటి వాటి ధరలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఉల్లి ని ప్రభుత్వమే రేషన్ కార్డు ఉన్నవారికి  సబ్సిడీ లో అమ్ముతుంది అంటే పరిస్థితి  ఇలా ఉందొ అర్ధం అవుతుంది.గత రెండు నెలలుగా ఇలాగే ఇబ్బంది పెడుతున్న ఉల్లి క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు డబుల్‌ సెంచరీ మార్కుకు చేరువైన ఉల్లి ధర ప్రస్తుతం కొంచం తగ్గి  సెంచరీకి చేరువలో ఉండడం గమనార్హం. 

ఇటివల కురిసిన అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో ధర పెరిగింది ఇప్పుడు కొత్తపంట అందుబాటులోకి వస్తుండడం, ఎగుమతులపై నిషేధం విధించడం, ఇతరత్రా కారణాలతో ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖ వంటి ముఖ్యనగరాల్లో బహిరంగ మార్కెట్లలలో  వందలోపే ధర పలుకుతోంది. హైదరాబాద్‌లో హోల్‌సేల్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చే కొత్త రకం  ఉల్లి 70 నుంచి 90 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు.

 

పాత ఉల్లి మాత్రం వంద రూపాయల పైనే పలుకుతోంది. మహారాష్ట్రలో గత ఏడాది సగం పంట దెబ్బతిన్నా మళ్ళీ రైతులు వెంటనే రబీ పంట వేయడంతో అది అందుబాటులోకి వచ్చింది అలాగే ఆంధ్రాలో కర్నూలు జిల్లాలో ఉల్లిని  పండించి పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిషేధం విధించడంతో ఇక్కడ కూడా ఉల్లి ధర తగ్గి తెలుగు రాష్ట్రాలలో ఈ పంట కొంత ఉపశమనం కలిగిస్తోంది అని సమాచారం. విశాఖ నగరంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో  రూ.80కు అమ్మకాలు జరిపారు. రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి రూ.25కు అందిస్తుండగా, సాధారణ కౌంటర్లలో 85 రూపాయలు చొప్పున అమ్మకాలు జరిపారు. అసెంబ్లీ సమావేశాల్లో  అధికార పక్షానికి ప్రతిపక్షానికి లేపినప్పటికి ఉల్లి పైన పెద్ద దుమారమే లేపింది. ఇపుడు కొంచం తగ్గడంతో గొడవ తగ్గింది అని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: