దేశవ్యాప్తంగా ఒక్కసారిలా ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి భారీగా తగ్గిపోవడంతో అటు మార్కెట్లో ఉల్లి కూడా భారీగానే డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి . భారీగా పెరిగిన ఉల్లి ధర  సామాన్య ప్రజలకు భారంగానే మారిపోయింది. అయితే ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. దేశంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలను తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలంటూ చాలామంది నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో పెరిగిన ఉల్లి ధరలపై ట్రోల్స్  కూడా బాగానే వచ్చాయి. ప్రతి విషయాన్ని ఉల్లి ధర తో కంపేర్ చేస్తూ సోషల్ మీడియా లో ఎన్ని ట్రోల్స్  కూడా వచ్చాయి . 

 

 

 

 భారీగా పెరిగిన ఇక్కడ ఇద్దరు వధూవరులు ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో కానీ భారీగా పెరిగిన ఉల్లి ధరలకు పెళ్లి పందిరి లో నే వధువు వరుడు వినూత్న నిరసన తెలిపారు. ఉల్లిపాయ దండలను పెళ్లిలో ఒకరికొకరు మార్చుకొని పెరిగిన ఉల్లి ధరలపై నిరసన తెలిపారు ఈ నూతన వధూవరులు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మామూలుగా అయితే పూలతో తయారు చేసిన పెళ్ళి దండలు మార్చుకోవటం  సర్వసాధారణం. కానీ ఇక్కడ పెళ్లి లో మాత్రం వరుడు వధువు ఉల్లి వెల్లుల్లి దండలను మార్చుకున్నారు. అంతేకాదండోయ్ ఈ పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు కూడా ఈ నూతన వధూవరులకు బహుమతిగా ఉల్లిపాయలను  అందించడం విశేషం. 

 

 

 

 కాగా  ఈ పెళ్లి స్థానికంగా ఆసక్తిని కలిగించింది. అయితే ఈ ఘటనపై స్పందించిన సమాజ్వాదీ పార్టీ నేత కమల్ పాటిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత నెల రోజుల నుండి దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి అని ఆయన తెలిపారు. దీంతో ప్రజలందరూ ప్రస్తుతం ఉల్లి ని బంగారాన్ని చూసినట్లు చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఈ పెళ్లిలో వరుడు వధువు ఉల్లి దండలు  మార్చుకున్నారు అంటూ తెలిపారు. ఉల్లి ధరలు 120 రూపాయలకు  వచ్చాయని ఆయన తెలిపారు. అయితే భారీగా పెరిగిన ఉల్లి ధరలపై నిరసన తెలిపేందుకు ఈ నూతన వధూవరులు ఉల్లి దండలు  మార్చుకున్నారని సమాజ్వాది పార్టీ నేత సత్యప్రకాష్ అన్నారు. ఉల్లి ధరలు భారీగా పెరగడం పై తమ పార్టీ కూడా వినూత్న రీతిలో నిరసన తెలిపిన అంటూ ఆయన గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: