సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్యాచార ఘటనలో నిందితుడిపై ఎటువంటి తీర్పు వెలువడనుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ రెడ్డి క్రూర ప్రవర్తనకు ముగ్గురు బాలికలు బలైపోయారు. ఆ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసిన ఆరోపణలపై బొమ్మలరామారం పోలీసులు 2019 ఏప్రిల్‌లో శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు బాలికల మీద మాత్రమే కాకుండా కర్నూలులోని ఓ మహిళపై కూడా అత్యాచారం, హత్య కేసులో నిందితుడు  ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

 

 

ఈ కేసు విచారణ అక్టోబర్ చివరి వారంలో నల్గొండలోని స్థానిక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రారంభమైంది. దీంతో ఈ హత్య కేసు విచారణ త్వరలోనే పూర్తవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ హత్యోదంతం నిందితుడు ఎం. శ్రీనివాస్ రెడ్డి వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. నిందితుడిని గురువారం ప్రశ్నించాడు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన 100 మందికి పైగా సాక్షులను, అధికారులను గత రెండు రోజుల్లో ట్రయల్ కోర్టు ప్రశ్నించింది. విచారణ సమయంలో ముగ్గురు బాధితుల తల్లిదండ్రులు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ విచారణ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని, దీనిపై తీర్పు నెలాఖరులోగా వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి.

 

 

అత్యంత తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి క్రూర మనస్తత్వంతో చేసిన పనులకు పోలీసులే విస్తుపోయారు.  ఇటీవలి దిశ ఘటన కూడా ఈ కేసుపై ప్రభావం చూపిందని చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని, ఉరి తీయలని డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో హజీపూర్ కేసు సంచలనంగా మారింది. నిందితుడికి ఉరి శిక్ష పడొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. బాధిత తల్లిదండ్రులు కూడా ఈకేసులో సత్వర న్యాయం జరగాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: