రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి నిబద్ధ‌త ఉండాలి. అది లేక పోతే.. ఎలా? -అంటూ ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన అ ధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. అయితే, త‌న విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ప రిస్తితిని ఆయ‌న స‌మీక్షించుకోలేక పోతున్నారు. త‌న పార్టీలో ప‌రిస్థితిని ఆయ‌న చక్క‌దిద్దుకోలేక పోతున్నార నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఓడిపోయారు. అయి తే, ఏకైక ఎమ్మెల్యేగా జ‌న‌సేన త‌ర‌ఫున రాజోలు నుంచి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా రు. అయితే, వ‌ర‌ప్ర‌సాద్‌కు, ప‌వ‌న్‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తుండ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన అంశం.

 

ప‌వ‌న్ బ‌య‌ట రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని, పాల న‌ను ఎండ‌గ‌డుతున్నారు. ఆరు నెల్ల‌లోనే రాష్ట్రం అతఃపాతాళానికి వెళ్లిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తు న్నారు. అదేస‌మ‌యంలో ఇసుక స‌హా.. తెలుగు మాధ్య‌మంపై దండెత్తారు. వివిధ రూపాల్లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయంగా ప‌వ‌న్ చ‌ర్య‌లు ఆస‌క్తిని రేపాయి. అయితే, అనూహ్యంగా వీటికి మ‌ద్ద‌తివ్వాల్సిన రాపా క మాత్రం వ్య‌తిర‌క గ‌ళం వినిపిస్తున్నారు.

 

తెలుగు మాధ్య‌మం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని చెప్ప‌డం తోపాటు ఆయ‌న ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఆంగ్ల మాధ్య‌మానికి జై కొట్టారు. జ‌గ‌న్ చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. ఇక‌, ఇసుక విష‌యంలోనూ రాపాక గ‌తంలో ఆఫ్ ది రికార్డుగా నోరు జారారు. మా నాయ‌కుడు ఉద్య‌మం చే స్తున్నాడు కానీ, ఇసుక వ‌స్తుందా?  వ‌ర‌ద‌ల్లో ఎదురెళ్లాలి!! అంటూ వ్యాఖ్యానించారు. ఇక‌, త‌న నియోజక వ‌ర్గంలో అమ్మ ఒడి సంద‌ర్భంగా జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేశారు.

 

కానీ, ప‌వ‌న్ మాత్రం బ‌య‌ట నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు జ‌న‌సేన‌లో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ చేస్తున్నారు. స‌భ‌లో ఒక ర‌కంగా, బ‌య‌ట ఒక ర‌కంగా మాట్లాడితే.. జ‌న‌సేన‌పై  న‌మ్మ‌కం వ‌స్తుందా?  ఆ పార్టీని ప్ర‌జ‌లు మెచ్చుకుంటారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి ప‌వ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: