స్మార్ట్ ఫోన్ల వాడకం రోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ల వాడకంతో  జనాలు మొత్తం ఫోన్ ని చూస్తూ లోకాన్ని మరిచిపోతారు. రోడ్లపై ఫోన్లో చూసుకుంటూ నడుస్తూ అసలు రోడ్డు ఎక్కడుందో కూడా తెలియకుండా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాదండోయ్ అటు బాత్రూంలోకి వెళ్లినా ఫోన్లో చూస్తూ అందులోనే గంటలు గంటలు సమయం గడిపేస్తూ ఉంటారు చాలా మంది. చాలా ఇళ్లల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి స్మార్ట్ ఫోన్ పట్టుకుని బాత్రూమ్ లోకి వెళ్లారు అంటే అబ్బో వాళ్ళు రావడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇక ఇలాంటి ఘటనలు ఆఫీసుల్లో కూడా  ఎక్కువగా జరుగుతుంటాయి. ఆఫీస్ టైం లో పని ఎగ్గొట్టడానికి చాలామంది స్మార్ట్ ఫోన్ పట్టుకుని  బాత్రూమ్ లోకి దూరి పోతారు. ఇక అక్కడ చాలా సేపు కాలం గడిపేసే బయటకు వస్తారు. 

 


 చాలా కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఎంప్లాయిస్ ఇలా బాత్రూంలోకి వెళ్లి వర్క్ టైం వేస్ట్ చేస్తుండడంతో కొన్ని కొన్ని సార్లు వార్నింగ్ లు  కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది బాత్రూం విషయంలో ఏం జోక్యం చేసుకుంటం లే  అంటూ సైలెంట్ గానే ఉంటారు. అయితే ఎంప్లాయిస్ అందరూ బాత్రూంలోకి వెళ్లి సెల్ ఫోన్ చూస్తూ అలాగే చాలా సమయం గడిపేసి బయటకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఓ కంపెనీలో ఎంప్లాయిస్ అందరూ తరచు అలాగే చేస్తున్నారు.  ఫోన్ పట్టుకుని బాత్ రూం కు వెళ్లి చాలా సమయం తర్వాత బయటకు వస్తున్నారు. దీంతో ఆ కంపెనీలో ఎంప్లాయిస్ పని సరిగ్గా జరగడం లేదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచించిన ఆ కంపెనీ అధికారులు. ఓ వినూత్న ఆలోచన చేశారు. 

 


 ఆ ఆలోచన మాత్రం కాస్త కొత్తగా ఇంకాస్త చెత్తగా ఉంది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటి అనుకుంటున్నారు... స్మార్ట్ ఫోన్ పట్టుకెళ్ళి బాత్రూంలో గంటలు గంటలు గడుపుతూ  పనివేళల్లో  టైమ్ పాస్  చేస్తున్నారు అని భావించిన కంపెనీ యాజమాన్యం... బాత్రూంలో పదినిమిషాల కంటే ఎక్కువ గడుపవద్దు  అని నిబంధన పెట్టింది. ఒకవేళ కంపెనీ పెట్టిన నిబంధన అతిక్రమించి ఎవరైనా బాత్రూం లో ఎక్కువసేపు ఉన్నారంటే .. బాత్రూంలో వాసన చూసి  దుర్వాసన రాకపోతే అప్పటివరకు బాత్రూంలో ఉన్న వ్యక్తిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తారట. ఆశ్చర్య పోయారు కదా.. కాగా ఈ నిబంధన పై నెటిజన్ల కూడా ఫన్నీగానే స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ  బాత్రూంలో వాసన చూసే ఆ  అదృష్టవంతుడు ఎవరబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: