ఈ మద్య కాలంలో సినిమా హీరోయిన్ల కన్నా యాంకర్లు, న్యూస్ రీడర్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.  ఒకప్పుడు మూస పద్దతిలో ఉన్న యాంకర్లు చాలా గ్లామర్ గా తయారవుతూ.. యాంకరింగ్ చేయడం కూడా ఆయా కార్యక్రమాలకు ప్లస్ పాయింట్ గా అవుతుందని అంటున్నారు.  ఇక  ఔట్ డోర్ న్యూస్ సేకరించే రిపోర్టర్లు ఎన్నో సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదుర్కొంటుంటారు.  తాజాగా లైవ్‌లో ఓ మహిళా జర్నలిస్టు పై ఓ అకతాయి అసభ్యంగా ప్రవర్తించాడు. తన వృత్తిలో భాగంగా ఆమె లైవ్‌లో నిమగ్నమైవుండగా ఓ పోకిరి ఆమె నడుం నడుంపై కొట్టి పారిపోయాడు. ఈ అనుకోని చర్యతో ఆ జర్నలిస్టు ఒకింత షాక్‌కు గురైంది. ఈ ఘటన జార్జియాలో జరిగింది.  ఓ బ్రిడ్జి వద్ద జరుగుతోన్న కార్యక్రమ విశేషాలను ఓ మహిళా జర్నలిస్టు లైవ్ లో చెబుతోంది.

 

ఆ కార్యక్రమంలో భాగంగా 'రన్ ర్యాలీ' ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న పలువురు టీవీలో కనపడాలన్న ఉత్సాహంతో ఓ మహిళా జర్నలిస్టు వెనుక నుంచి 'హాయ్' చెబుతూ వెళ్లారు. ఆమె కూడా చాలా ఉత్సాహంగా న్యూస్ చెబుతూ వారికి ఉత్సాహాన్ని అందిస్తుంది. అంతలోనే ఓ వ్యక్తి  ఆ మహిళా జర్నలిస్టు నడుముపై కొట్టి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో ఆమె షాక్ అయింది. అయినప్పటికీ తన లైవ్ కవరేజ్ ను కొనసాగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

 

జార్జియాలోని సవ్హానా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చర్యకు పాల్పిన వ్యక్తిని థామస్ కల్లావె(43) గా పోలీసులు గుర్తించారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇటువంటి చర్యలను తాము ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దీన్ని 11 మిలియన్ల మంది చూశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: