పవన్ కల్యాణ్ పొలిటికల్ పార్టీ జనసేన స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన రాజు రవితేజ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇకపై పార్టీ కార్యకలపాలతో తనకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పవన్ అనైతిక విధానాలు, వ్యవహారశైలి నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కులాలపై, మతాలపై ఆయన స్పీచెస్ ఎక్కువవుతున్నాయి. బయటి పార్టీవారికంటే జనసేన పార్టీలోని వారే పవన్ ను వ్యతిరేకిస్తున్నారు. పార్టీకోసం చాలా చేద్దామనుకున్నా నాకు అవకాశం కనబడటం లేదు.

 

సమాజాన్ని విచ్చిన్నం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారు. కులాలపై ఆయన ట్విట్టర్ లో చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతిగా ఇంకా విద్వేషపూరిత వ్యాఖ్యలు వస్తున్నాయి. పవన్ కు పబ్లిక్ తో బిహేవ్ చేయడం రాదు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు. పవన్ రెచ్చగొట్టే ధోరణితో సమాజానికి ప్రమాదం. కులాలను కలుపుకుని వెళ్లే రాజకీయం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. జనసేన సిద్ధాంతం. కానీ.. పవన్ వీటిని పక్కనపెట్టేసి ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల కొత్తగా కక్ష, కుట్రలు కూడా రేకెత్తిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పవన్ సమక్షంలోనే కొందరిని నరికేస్తాను.. అంటే దానిని పవన్ కనీసం ఖండించలేదు. ఇలాంటి వాఖ్యలు పార్టీలో దేనికి సంకేతం ఇస్తున్నాయో తెలీటం లేదు. పార్టీని పర్సనల్ స్టేజ్ గా ఉపయోగించుకుంటున్నారు. పవన్ ప్రసంగాలతో నాయకులు ఇబ్బందులు పడ్డారు.

 

నా రాజీనామాను పవన్ కు వ్యక్తిగతంగానే ఇచ్చాను. పవన్ ఇప్పటికీ మంచి వ్యక్తి. కానీ.. ఆ మంచితనాన్ని పక్కనపెట్టేసి ఆయన వేరే దారిలోకి వెళ్లిపోతున్నాడు. ఎన్నికల్లో ఓటమికి కారణం చెప్పినా పవన్ ఒప్పుకోలేదు, వినలేదు కూడా. పవన్ కారణంగానే రాజకేయాల్లోకి వచ్చాను.. మళ్లీ రాజకేయాల్లోకిగానీ.. జనసేనలోకి వచ్చే అవకాశం లేదన్నారు. పవన్ మాటలను నమ్మితే మోసపోవడం ఖాయమని రాజు రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: