జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌  ఇటివల ఢిల్లీ టూర్ తిరిగివచ్చాక బీజేపీ పార్టీ ని నాయకులను మరియు హిందుత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది ఇటివల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు మండిపడుతున్నారు. 

ఈమధ్య చేసిన చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం పవన్ హైందవ ధర్మం గురించి  మాట్లాడిన అయన  హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరు గురించి పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. తిరుమల శ్రీవారి దర్శించుకొన్న తర్వాత తిరుపతిలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. మత మార్పిడిలపై ప్రశ్నించారు. అంతేకాదు దీని వెనక ఎవరి హస్తం ఉందని ఆరోపించారు. అలాగే  విజయవాడ దుర్గ  పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు తప్పుపట్టిన పవన్ మరియు   చేసిన వ్యాఖ్యలకు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయన చేసిన కామెంట్స్ సీఎం జగన్ ని ఉద్దేశించి అని అందరు అనుకుంటున్నారు.అలాగే పవన్ మత మార్పిడిల ప్రక్రియ సీఎం జగన్ నివాసానికి సమీపంలో జరుగుతున్నాయనడంతో నేరుగా ఆయననే టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఎన్నడు దేవుడి గురించి హిందుత్వం గురించి మాట్లాడని పవన్ ఇప్పుడు ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం అలాగే  మరోవైపు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్యమత ప్రచారానికి అభ్యంతరం చెప్పడంతోనే పదవీనుంచి తప్పించారని ప్రచారం జరుగుతుంది. పవన్ బీజేపీ అండతోనే ఎలాంటి దుశ్చర్య పాలుపడుతున్నడని  క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.పవన్ కల్యాణ్ హిందూత్వ అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను పొగడటంపై జనసేన కార్యకర్తలు కూడా భేదించారు. క్రిస్టియన్ మిషనరీ సంస్థలు జనసేన లోని క్రిస్టియన్ కార్యకర్తల పైన పవన్ విమర్శలను ఎదుర్కోవాలని  ఒత్తిడి చేశాయని తెలుస్తోంది. పార్టీ నుంచి బయటకు రావాలని ఒత్తిడి చేశాయని, బయటకొచ్చాక విమర్శలు చేయడం జరపాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: