పెళ్లి గురించి మనవాళ్ళు ఏంతో గొప్పగా చెప్తారు.  జీవితంలో ఒక్కసారి చేసుకునేది కాబట్టి, దానిని అంగరంగ వైభవంగా చేసుకోవాలని, పదిమంది మెచ్చుకునే విధంగా చేసుకోవాలని అనుకుంటారు.  దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడరు. పెళ్లి చేసుకునే తీరు నుంచి భోజనాల వరకు అన్ని స్పెషల్ గా ఉండాలని అనుకుంటారు.  భోజనంలో తప్పకుండా ఉల్లి ఉండి తీరాల్సిందే.  కానీ, దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉల్లి అంటే భయపడుతున్నారు.  


కారణం కేజీ ఉల్లి మాంసం ధర కంటే కూడా అధికంగా ఉంటోంది. కేజీ మాంసం ధర 120 నుంచి 160 వరకు ఉంటె, ఉల్లి మాత్రం 200 ఉండటం విశేషం.  అందుకే ఉల్లిని వినియోగించాలంటే ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు.  వంటగదిలో ఏమున్నా లేకున్నా ఉల్లి ఉంటె చాలు ఏదో ఒక కూర చేసుకోవచ్చు అనుకునే వ్యక్తులు ఉల్లి లేకున్నా పర్వాలేదు అనే దాకా వచ్చేశారు.  


ఇక పెళ్లిళ్లలో కూడా చాలామంది బంధువులు వధూవరులకు అవి ఇవి గిఫ్ట్ లుగా కొని  ఉల్లిని కొని వాటిని గిఫ్ట్ ప్యాక్ లా మార్చి వధూవరులకు అందిస్తున్నారు.  వాటిని వధూవరులు కూడా హ్యాపీగా తీసుకుంటున్నారు.  ఇప్పుడే దేశంలో ఉల్లి గురించి చర్చ జరుగుతున్నది.  పార్లమెంట్ కూడా దీనిపై చర్చ చేశారు కూడా. చాలాచోట్ల ఉల్లిపాయలను దొంగలు దోచుకుపోయారు.  ఉల్లి కనిపిస్తే వదలడం లేదు.  ఉల్లి హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నది.  


ఇకపోతే, ఇటీవలే యూపీలో ఓ వివాహం జరిగింది.  ఈ పెళ్లిలో వధూవరులు మాములు పూల దండలకు బదులుగా ఉల్లితో చేసిన దండలను మార్చుకున్నారు.  ఇలా ఉల్లి దండలు వేసుకొని తమ నిరసనను తెలిపారు.  గత మూడు నెలలుగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పించి దిగిరావడం లేదు. ప్రతిపక్షాలు ఈ విషయంలో ఆందోళనలు చేస్తున్నాయి.  సెలెబ్రిటీలు సైతం ఉల్లిపై సెటైర్లు వేస్తుండటంతో ప్రజలు షాక్ అవుతున్నారు.  ప్రభుత్వాలు మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: