పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది. మద్యపాన నిషేధం... కుటుంబాలు మద్యంతో నాశనం అయిపోతున్నాయని భావించిన జగన్... దాన్ని నిశేధించడమే మంచిది అనే అభిప్రాయానికి వచ్చి ఆ విధంగా హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్... ధరలను భారీగా పెంచడమే కాకుండా, సామాన్యులకు మద్యం దొరికే పరిస్థితులను పూర్తిగా మార్చేసారు అనే చెప్పాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దొరకడం కష్టం గా మారింది.

 

దొరికినా సరే అది అధిక ధరల్లో ఉండటంతో మద్యం తాగాలి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీనిపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉన్నా సరే జగన్... మద్యాన్ని ఆదాయవనరుగా చూడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ కొనియాడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఇక ఇప్పుడు దీనిపై సరిహద్దు రాష్ట్రం తెలంగాణా దృష్టి సారించినట్టు సమాచారం.

 

తెలంగాణాలో మద్యం కారణంగా గత కొంత కాలంగా ప్రమాదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. మహిళలు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. దీనితో అక్కడ కూడా మద్యపాన నిషేధం అమలు చెయ్యాలి అనే డిమాండ్లు వస్తున్నాయి. దీనితో తెలంగాణా ప్రభుత్వంలోని కీలక అధికారులు ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తున్నారు.

 

సాధ్యా సాధ్యాలను ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడ కూడా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మద్యపాన నిషేధంపై ఆరా తీయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణ‌కు చెందిన కొంద‌రు మంత్రులు సైతం ఇప్ప‌టికే ఏపీలోని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో పాటు మ‌ద్య నిషేధంపై ఆరాలు తీసినట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: