ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చూసిన వారికి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చంద్రబాబులో ఎప్పుడు చూడని విధంగా ఆవేశం చూసారు రాష్ట్ర ప్రజలు... ఆయన ప్రసంగంలో, ప్రవర్తనలో దూకుడు కనపడుతుంది. ఎన్నడు లేని విధంగా చంద్రబాబు... ఆగ్రహంగా కనపడుతున్నారు. తనలో అసహనం ఉన్నా సరే ఎప్పుడు బయటపడని చంద్రబాబు ఈ సమావేశాల్లో మాత్రం దానిని ప్రదర్శిస్తున్నారు... అధికార పక్షంపై ఊగిపోతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మార్షల్స్ తనను అడ్డుకున్న సమయంలో కూడా ఆయన దురుసుగానే ప్రవర్తించారు.

 

ఆయన ఆ మాట అన్నారు లేదు అనేది పక్కన పెడితే ఆయనలో మాత్రం కోపం ఎక్కువగా కనపడుతుందని... చంద్రబాబుని దగ్గరగా చూస్తున్న ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇటీవల తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. రాజకీయంగా బలహీనంగా ఉండటం, తన వాదన ప్రజల్లోకి వెళ్లకపోవడం, తనను గుర్తించకపోవడం, ఇక జగన్ దూకుడుతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ జారిపోతారో అనే ఆందోళన చంద్రబాబులో కనపడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

 

చంద్ర‌బాబు అంటేనే ఎప్పుడు కూడా దూకుడు ని తనలోనే దాచుకునే అలవాటున్న ఉన్న వ్య‌క్తి. ఆయ‌న ఇప్పుడు ఉన్నంత దూకుడు, అస‌హ‌నం ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ లేద‌ని చాలా మంది ఆయ‌న స‌న్నిహితులే చెపుతున్నారు. తెలుగుదేశం అధినేత ఇప్పుడు ఎమ్మెల్యేల వద్ద కూడా అసహనంగా మాట్లాడటమే కాదు... ఎవరైనా సభలకు రాకపోతే రాజీనామా చేసి పొండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారట. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం బాబు తీరుపై తీవ్ర విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.

 

తన వ్యూహాలు ఫలించకపోవడం, ప్రజల్లో ఊహించిన స్థాయిలో వ్యతిరేకత లేకపోవడం, క్యాడర్ కూడా బయట జారిపోతుంది అనే సమాచారం తనకు అందడంతో చంద్రబాబు... ఇప్పుడు ఆగ్రహంగా కనపడుతున్నారట. అటు కేంద్రం నుంచి కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇది కూడా ఒక కారణం అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: