ఉత్తర్‌ప్రదేశ్ ప‌ర్య‌ట‌న‌లో ప్రధాని నరేంద్ర మోదీకి పెను ప్ర‌మాదం త‌ప్పింది.  మోదీ సర్కార్ నమామి గంగ ప్రాజెక్టు పేరిట గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, యూపీలో కాన్పూర్‌లోని అటల్ ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ పవిత్ర గంగానదిలో విహరించారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలతో పాటు ఎన్డీఏ మిత్రపక్ష నేతలు మోదీ వెంట ఉన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు.గంగానది పరివాహక ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పర్యటనకు గైర్హాజరయ్యారు. కాగా, ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌కు పెను ప్ర‌మాదం త‌ప్పింది.

 

 

వ‌ణుకు పుట్టించిన బొత్స వ్యాఖ్య‌లు... రాజ‌ధానిపై సంచ‌ల‌న కామెంట్లు

 

చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీలో మోదీ అధ్యక్షతన జరిగిన నేషనల్ గంగా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ఉదయం కాన్పూర్‌ చేరుకున్న మోదీకి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సాదర స్వాగతం పలికారు. గంగానది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను ప్రధాని అధికారులతో చర్చించారు. స్వచ్ఛ గంగ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌కు మోదీ నివాళులర్పించారు. ఈ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. అనంతరం కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మోదీ బోట్‌రైడ్‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మెట్లు ఎక్కుతుండ‌గా... జారి కిందపడ్డారు.  వెంట ఉన్న సెక్యూరిటీ త‌క్ష‌ణ‌మే ఆయన్ను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎటువంటి గాయాలు తగలేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత యథావిధిగా అన్ని కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు.

 

గాంధీ ఆస్ప‌త్రిలో..దిశ నిందితుల శ‌వాల‌పై షాకింగ్ నిర్ణ‌యం...విష‌యం తెలిస్తే మైండ్ బ్లాంక్‌

కాగా, ‘నమామి గంగే’ పథకం సమీక్షా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎంతవరకూ విజయవంతమైందనే విషయాన్ని ప్రత్యక్షంగా అంచనా వేశారు. శనివారం జరిగిన‌ నేషనల్‌ గంగా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనటానికి మోదీతో సహా పన్నెండు మంది కేంద్ర మంత్రులు, తొమ్మిది మంది కేంద్ర మంత్రిత్వ శాఖల సెక్రటరీలు, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాన్పూర్ కు విచ్చేయ‌గా రెండు గంగా పరీవాహక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొనలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: