గ‌త కొద్దికాలంగా, బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పెద్ద ఎత్తున‌ మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కేంద్ర రాష్ట్రాల‌కు ఇచ్చే నిధుల విష‌యంలో, వివిధ బిల్లుల విష‌యంలో కేసీఆర్ సార‌థ్యంలోని టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో గ‌ద్దెనెక్కిన బీజేపీని టార్గెట్ చేస్తుండ‌గా...ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి...ఆయా స‌మ‌స్య‌ల విష‌యంలో ఆయ‌న అనుస‌రిస్తున్న తీరును బీజేపీ నేత‌లు ఎండ‌గడుతున్నారు. దీంతో స‌హ‌జంగానే ఇరు పార్టీల మ‌ధ్య విమ‌ర్వ‌లు ప్ర‌తి విమ‌ర్ళలు సాగుతున్నాయి. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స్వ‌యంగా బీజేపీ నేత‌లే త‌మ‌ను విమ‌ర్శించే ఓ అవ‌కాశం ఇచ్చార‌ని అంటున్నారు. అదే ఢిల్లీలో కొత్త పార్ల‌మెంటు నిర్మాణం.

 

గాంధీ ఆస్ప‌త్రిలో..దిశ నిందితుల శ‌వాల‌పై షాకింగ్ నిర్ణ‌యం...విష‌యం తెలిస్తే మైండ్ బ్లాంక్‌

 

తెలంగాణలో కొత్త అసెంబ్లీ, నూతన సచివాలయం భవనాలను నిర్మించాలన్న ప్రతిపాదనలను తెలంగాణ రాష్ర్ట బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇదే స‌మ‌యంలో ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని కేంద్ర బీజేపీ నాయకత్వం భావిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నూతన పార్లమెంటు భవన నిర్మాణం ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గ‌తంలోనే తెలిపారు. తాజాగా ఆయ‌న మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పార్లమెంట్‌ సమావేశాలు 2022లో కొత్త భవనంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

 

ప‌వ‌న్‌ను తిట్టుకొని... వ‌ర్మ‌ను మెచ్చుకుంటున్న ఫ్యాన్స్‌... రాజు ర‌వితేజ ఎఫెక్ట్‌

గ‌తంలో జ‌రిగిన‌ పార్లమెంటు సమావేశాల చివర్లో కూడా ఓం బిర్లా పార్లమెంటు కొత్త భవన నిర్మాణం ప్రస్తావన తీసుకొచ్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022నాటికి ‘సరికొత్త భారత్‌'ను ఆవిష్కరించాలని ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. దీంట్లో భాగంగా పార్లమెంటు భవనాన్ని విస్తరించడం లేదా ఆధునీకరించే అంశాన్ని కూడా చేర్చాలని ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఎపిసోడ్‌పై టీఆర్ఎస్ నేత‌లు స‌హ‌జంగానే భ‌గ్గుమంటున్నారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కావాలని చెబుతూ.. ఇక్కడ మాత్రం కొత్త అసెంబ్లీకి అడ్డుపుల్ల వేయడం ఏంటని ప్ర‌శ్నిస్తున్నారు.


ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ, ‘దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న వేళ పార్లమెంట్‌ సమావేశాలను కొత్త భవనంలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నది. 2022నాటికి కొత్త భవనం అందుబాటులోకి వస్తుందనే నమ్మకం నాకు ఉన్నది’ అని పేర్కొన్నారు. భవనం ఎక్కడ కడుతారని ప్రశ్నించగా.. ప్రభుత్వం దృష్టిలో రెండు మూడు ప్రాంతాలు ఉన్నాయన్నారు. కొత్త భవనంలో ఎంపీలకు అత్యాధునిక సాంకేతికత, అనేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉభయ సభల్లో జరిగిన జరిగిన 1858 చర్చలు, ప్రసంగాలను డిజిటలైజ్‌ చేశామని తెలిపారు. ఇందులో బ్రిటిష్‌ హయాంలో జరిగినవి కూడా ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి చిహ్నమైన భారత పార్లమెంటు భవనం అత్యంత ఆకర్షణీయంగా, అత్యద్భుతంగా ఉండాలనేది తమందరి ఆకాంక్ష అని కూడా ఓం బిర్లా పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: