ఇటీవల మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనం సృష్టించిన లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సర్వత్రా నిరసనలు పెల్లుబికాయి. నలుగురు నిందితులు ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసి, ప్రియాంకను ట్రాప్ చేసి మరీ అత్యాచారం చేయడం, అనంతరం ఆమెను ఘోరంగా చంపేసి, పెట్రోల్ తో కాల్చేయడం ఘటనలు తలుచుకుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతుంది. అమాయకమైన ఒక అమ్మాయిని కేవలం క్షణిక సుఖం కోసం అంత దారుణంగా హింసించి హత్య చేయడం ఎంతో హేయమైన చర్య అని పలువురు సినీ, 

 

రాజకీయ ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేసారు. ఇక మహిళా మరియు ప్రజా సంఘాల వారు అయితే నిందితులను మాత్రం కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. అయితే ఘటన జరిగిన పది రోజుల లోపే విచారణ సందర్భంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ప్రియాంకను కాల్చేసిన చోటికి నిందితులను పోలీసులు తీసుకెళ్లగా, నిందితులు నలుగురూ కూడా పోలీసులపై రాళ్ల దాడి చేసి తప్పించుకోబోవడంతో, వెంటనే వారిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇక ఆ నిందితుల మరణ వార్తతో దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసుల పై ప్రశంసలు కురిసాయి. ఇకపోతే ఇటీవల ప్రియాంక మృతదేహాన్ని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించిన తరువాత నిన్న ఫైనల్ గా ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ)రిపోర్ట్ ని సమర్పించారని, 

 

దాని ప్రకారం ప్రియాంక మృతదేహంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా ఆమె లీవర్ లో ఆల్కహాల్ ఉన్నట్లు స్పష్టం అయిందని సమాచారం. అలానే ఆమె శరీరం పై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి వంటి తదితర అంశాలన్నీ కూడా ఫోరెన్సిక్ వారు ప్రభుత్వానికి సీల్డు కవరులో నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. దీనికి బట్టి చూస్తుంటే నిందితులు ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోసినట్లు కొంతవరకు అర్ధం అవుతోందని, ఇంతటి ఘాతుకానికి తెగబడ్డ ఆ నీచులకు దేవుడు ఎన్కౌంటర్ రూపంలో సరైన శిక్ష విధించాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: