రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాల పేరిట ఘర్షణలు సృష్టించేందుకు  భారీ తరహాలో కుట్రలు సాగుతున్నాయని  వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ  ఈ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కంకణబద్ధులు కావాలని ఆయన అందరికి పిలుపునిచ్చారు. శాంతి, సౌభ్రాతృత్వం కోసం విద్యార్థులు, యువతను తగిన రీతిలో తీర్చిదిద్ది, వారిని ఈ రంగంలో ఉపయోగించే విషయంలో మేధావులు కృషి చేయాలని ఆయన కోరారు.

 

 ఒక ప్రైవేట్‌ హోటల్లో ఆల్‌ ఇండియా పీస్ ఈ శనివారం జరిగిన సాలిడారిటీ ఆర్గనైజేషన్‌ ద్వితీయ మహాసభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఇప్పుడు ఆసన్నమైందన్నారు. అంతేకాదు బి.వినోద్‌ కుమార్‌ ఇటీవలి తన అమెరికా పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో జరిగాయని వాటిని అందరికి దృష్టికి తెచ్చానని , నిజానికి అక్కడి యువత ఆర్థికంగా ఎదగడం కన్నా సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారని ఆయన ప్రస్తావించారు.

 

యువత ప్రతి విషయంలో ఏ  విధంగా ఎదగాలి అన్న ఆలోచనతో వున్నారు అని కూడా తెలియచేశారు . ఈ సభ ద్వారా బి.వినోద్‌ కుమార్‌ ప్రతి యువతను అన్ని విధాలుగా మనం తీర్చిదిద్దాలి  అందుకు గొప్ప గొప్ప మేధావులైన వారు ముందడుగు వేయాలని ఆయన  కోరారు .

 

ఈ మహాసభ  ఆహ్వాన సంఘం చైర్మన్‌ కాచం సత్యనారాయణ అధ్యక్షతన జరిగినది ఈ సభకు  సీపీఐ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్‌ నాయకుడు,  సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ, శాంతి సంఘీభావ సంఘం నాయకులు పల్లబ్‌ సేన్‌ గుప్తా, అరుణ్‌ కుమార్, తిప్పర్తి యాదయ్య, జగన్మోహన్, రఘుపాల్‌ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: